నేటినుండి ఈ రాశుల వారు మట్టి ముట్టుకున్నా బంగారమే!
వేద జ్యోతిష్య శాస్త్రంలో నేడు రెండు గ్రహాలు చేస్తున్న నక్షత్ర సంచారం కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. నేటి నుంచి కొన్ని రాశుల వారు మట్టి పట్టుకున్నా బంగారం అవుతుంది . జ్యోతిషశాస్త్రం ప్రకారం శని గ్రహం తర్వాత అత్యంత ప్రాముఖ్యత కలిగిన గ్రహాలలో అంగారక గ్రహం, రాహువు ముఖ్యమైనవి. రాహువు కుజుడు నేడు అరుదైన నక్షత్ర సంచారం చేయనున్నాయి.
రాహు, కుజుల నక్షత్ర సంచారం
100సంవత్సరాల తర్వాత రాహువు , కుజుడు ఒకే రోజున ఒకే సమయంలో నక్షత్ర సంచారం చేస్తున్నాయి. ఈ నక్షత్ర సంచారం ముఖ్యంగా మూడు రాశులవారికి మెరుగైన ఆర్థిక ప్రయోజనాలను కలిగిస్తున్నాయి. నేడు ఆదివారం రాత్రి 11.52నిమిషాలకు కుజుడు పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఇక ఇదే సమయంలో రాహువు ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ రెండు గ్రహాలు చేసే నక్షత్ర సంచారం వలన లబ్ధి కలిగే ఆ రాశులను తెలుసుకుందాం.

మేషరాశి
మేష రాశి వారికి కుజ, రాహువుల యొక్క నక్షత్ర సంచారం నేటి నుంచి అదృష్టాన్ని ఇస్తుంది. ఇది మేషరాశి జాతకులకు ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది. మీరు ఈ సమయంలో సమాజంలో గౌరవించబడతారు. ఏ పని చేసిన విజయం వరిస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి పురోగతి ఉంటుంది.
వృషభ రాశి
వృషభ రాశి వారికి రాహువు కుజుల సంచారం బాగా కలిసి వస్తుంది. వృషభ రాశి వారు ఉద్యోగాలు చేస్తున్నట్లయితే ఉన్నతాధికారుల నుండి గుర్తింపు వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి. ఈ సమయంలో ఏ పని చేసినా వీరికి ఎదురు లేకుండా ఉంటుంది.
సింహరాశి
సింహ రాశి వారికి రాహువు, కుజల సంచార ప్రభావం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో సింహరాశి జాతకులు ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు. కుటుంబంతో దూర ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. సింహ రాశి వారి వైవాహిక జీవితం బాగుంటుంది. సింహరాశి వారి ఆరోగ్యం ఈ సమయంలో మెరుగ్గా ఉంటుంది. కెరీర్ పరంగా అద్భుతమైన విజయాలను సాధిస్తారు.
ధనుస్సు రాశి
రాహువు, కుజల సంచారం ధనస్సు రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది. ధనుస్సు రాశి జాతకులు విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. ఆర్థికంగా ఈ సమయంలో బలోపేతం అవుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తారు. ఇది ధనస్సు రాశి వారికి శుభాలను ఇవ్వడమే కాకుండా సంపదలను కూడా ఇస్తుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి రాహువు కుజల సంచారం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి జాతకులు ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు. ఎప్పటినుండో పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవుతాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. ఉద్యోగాలు చేసేవారు ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications