నేటినుండి ఆగస్ట్ 1వరకు వీరికి డబ్బులే డబ్బులు.. చెక్ రాసిచ్చిన తిరోగమన బుధుడు!
గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశికి కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. గ్రహాల సంచారం, గ్రహాలలో జరుగుతున్న మార్పులు ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు కలుగుతాయి. మరికొందరికి మిశ్రమ ఫలితాలు సంభవిస్తాయి. ఇంకొన్ని రాశుల వారు ప్రతికూల ఫలితాలను చూస్తారు.
బుధ తిరోగమనం.. వీరిదే అదృష్టం
గ్రహాల రాకుమారుడిగా పిలువబడే బుధుడు తెలివితేటలు, తర్కం, స్నేహం, వాక్చాతుర్యం వంటి వాటికి ప్రతీకగా చెబుతారు, అటువంటి బుధుడు నేడు సింహరాశిలో తిరోగమన సంచారం మొదలుపెట్టాడు. నేటి నుండి జరుగుతున్న బుధుడు తిరోగమన కదలిక ఆగస్టు 1వ తేదీ వరకు కొన్ని రాశులకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. దీని ప్రభావం కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది.

మిధున రాశి
మిథున రాశి వారికి బుధుడి తిరోగమన సంచారం కలిసి వస్తుంది. వీరికి ఇది పురోగతిని సూచించే సమయం. ఈ సమయంలో మిధున రాశి వారికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మిధున రాశి జాతకుల వ్యాపారస్తులు ఆశించిన లాభాలను పొందుతారు. పని ఒత్తిడి కారణంగా ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి, విశ్రాంతి తీసుకోవడం ఉత్తమం.
సింహరాశి
సింహ రాశి వారికి బుధుడి తిరోగమన సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో సింహ రాశి వారికి సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సంతోషకర వాతావరణం ఉంటుంది. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఆచితూచి నిర్ణయం తీసుకోవడం అవసరం. అనుభవజ్ఞులతో చర్చించి నిర్ణయం తీసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. ఇది వీరికి మంచి సమయం.
కన్యారాశి
కన్యా రాశి వారికి బుధుడి తిరోగమన సంచారం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో కన్యా రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. కష్టపడి పనిచేసే కన్యా రాశి వారు మంచి ఫలితాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. కన్యారాశి జాతకులైన విద్యార్థులు కూడా ఈ సమయంలో మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications