వైకుంఠ ఏకాదశి నుండి వీరే మహర్జాతకులు... నామాటే శాసనమన్న శ్రీమహా విష్ణువు!

హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఏకాదశి తిథికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఏకాదశి వ్రతాన్ని సంవత్సరంలో 24 సార్లు ఆచరిస్తారు. 2025 సంవత్సరంలో వస్తున్న విశిష్టమైన ఏకాదశి వైకుంఠ ఏకాదశి. ఈ ఏకాదశికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. వైకుంఠ ఏకాదశి శ్రీమహావిష్ణువుకి చాలా ఇష్టమైన రోజు. వైకుంఠ ఏకాదశి జనవరి 9 మధ్యాహ్నం 12.22 నిమిషాలకు ప్రారంభమై జనవరి 10 ఉదయం 10.19 నిమిషాలకు ముగుస్తుంది.

వైకుంఠ ఏకాదశి నాడు శుక్ల యోగా
ఉదయం తిథి ప్రకారం జనవరి 10నే వైకుంఠ ఏకాదశి జరుపుకుంటాము. అయితే వైకుంఠ ఏకాదశి ఈసారి ప్రత్యేక యోగ కలయికతో రాబోతుంది. వైకుంఠ ఏకాదశి రోజు శుక్ల యోగ ఏర్పడుతుంది. ఇది జ్యోతిష్య శాస్త్రంలో చాలా పవిత్రంగా భావించబడుతుంది. అయితే ఇది కొన్ని రాశుల వారికి భారీ ప్రయోజనాలను కలిగిస్తుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

From Vaikuntha Ekadashi onwards these zodiac signs will get wealth with vishnu blessings

మేషరాశి
వైకుంఠ ఏకాదశి మేష రాశి జాతకులకు లబ్ధి చేకూరుస్తుంది. మేష రాశి వారిపై విష్ణు యొక్క ప్రత్యేక ఆశీర్వాదం ఉంటుంది. మేషరాశి వారి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. ఆర్థిక స్థితి బలపడుతుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి వైకుంఠ ఏకాదశి నుండి కలిసొస్తుంది. వైకుంఠ ఏకాదశి తర్వాత వీరి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏ పని చేసిన విజయాలు వరిస్తాయి. నూతన ఆలోచనలు, ప్రణాళికలు వీరికి ఆర్థికంగా ప్రయోజనాలను చేకూరుస్తాయి. వర్తక వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. కుటుంబంతో సంబంధాలు బలపడతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు వస్తాయి.

తులారాశి
వైకుంఠ ఏకాదశి నుండి తులారాశి వారు వృత్తి వ్యాపారాలలో విజయం సాధిస్తారు. ఈ సమయం తులా రాశి వారికి కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి భాగస్వామ్య వ్యాపారాలకు ఈ సంవత్సరం ఉత్తమమైనదిగా చెబుతారు. కుటుంబ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. స్నేహితులతో సంబంధాలు బలపడతాయి.

ధనుస్సు రాశి
వైకుంఠ ఏకాదశి నుండి ధనస్సు రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ధనుస్సు రాశి జాతకులు కెరీర్లో విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుంది . ధనుస్సు రాశి వారి గౌరవం పెరుగుతుంది. ఈ సమయంలో వీరికి అన్ని విధాలుగా ఏ పని చేసిన అదృష్టం కలిసి వస్తుంది.

మీన రాశి
మీన రాశి వారిపై శ్రీమహావిష్ణువు కటాక్షం ఉంటుంది. వైకుంఠ ఏకాదశి నుండి ఉద్యోగస్తులకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి వేగంగా మెరుగుపడుతుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. వృత్తిలో వేగవంతమైన అభివృద్ధి కూడా కనిపిస్తుంది. ఇది మీన రాశి వారికి అదృష్ట సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+