కేతువు ఎంట్రీతో ఈ రాశుల వారికి డబ్బే డబ్బు..!
జ్యోతిష్య శాస్త్రంలో కేతువు ఒక ఛాయా గ్రహం.దీనిని దక్షిణ నోడ్ అని కూడా అంటారు. రాహువుతో కలిసి కేతువు చంద్రుని కక్ష్యను కలుస్తుంది.కేతువును అశుభ గ్రహంగా పరిగణిస్తారు. ఇది విపత్తులు, దురదృష్టం, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తిని సూచిస్తుంది. కేతువు ధనుస్సు మరియు మీన రాశులకు కారకుడు.
కేతువు వ్యక్తి యొక్క జాతకంలో ఉన్న స్థానాన్ని బట్టి, దాని ప్రభావం మారుతుంది.కేతువు యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి, వివిధ పరిహారాలు ఉన్నాయి.కేతువు గ్రహం సింహ రాశిలోకి ప్రవేశించబోతోంది. దీని కారణంగా మూడు రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఆ మూడు రాశులు ఏంటో ఓసారి పరిశీలిద్దాం.

తులా రాశి
కేతువు గ్రహం సంచారం వల్ల తులా రాశి వారికి శుభప్రదంగా ఉండనుంది. కేతువు అనుగ్రహంతో తులా రాశి వారు అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఈ రాశి వారు ఊహించని విధంగా లాభాలు పొందుతారు. విద్యార్థులు కెరీర్ పరంగా చాలా బాగుంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.వ్యాపారాల్లో కూడా ఊహించని స్థాయిలో లాభాలు కలుగుతాయి.
మేష రాశి
మేష రాశివారికి కేతువు అనుగ్రహం పుష్కలంగా ఉండనుంది. ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు లభిస్తాయి. ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు త్వరగతిని పూర్తి అవుతాయి. కెరీర్ పరంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి.కేతువు అనుగ్రహం వల్ల అద్భుతమైన లాభాలు పొందుతారు.
కేతువు ఎఫెక్ట్‌తో అద్భుతమైన లాభాలు పొందే రాశిలో కన్య రాశి కూడా ఒకటి. వీరికి ఉద్యోగంలో పదోన్నతులు లభించడం ద్వారా జీతాలు విపరీతంగా పెరుగే అవకాశం కనిపిస్తోంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.ఎంతో కష్టపడి పనులు చేసేవారికి కోరికలన్నీ సులభంగా నెరవేరుతాయి. అలాగే అదృష్టం కూడా వరిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications