త్వరలో వీరికి రాజభోగాలను, సంపదలను అనుగ్రహించే గజకేసరి, బుధాదిత్య రాజయోగాలు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో ఒకేసారి రెండు రాజయోగాలు ఏర్పడడం అరుదుగా జరుగుతుంది. అయితే ఈనెల 14 ,15 ,16 తేదీలలో రెండు రాజయోగాలు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతున్నాయి. ఈనెల 14వ తేదీన వృషభ రాశిలో ఉచ్చ స్థితిలో ఉండే చంద్రుడు అదే రాశి సంచరిస్తున్న గురువుతో సంయోగం చెందడం వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది.
ఒకేసారి రెండు రాజయోగాలు
ఈ యోగం దానికి సప్తమ స్థానంలో ఇప్పటికే ఏర్పడి ఉన్న బుధాదిత్య రాజయోగాన్ని వీక్షించడం వల్ల ఈ రెండు రాజయోగాలు కొన్ని రాశుల వారికి రాజయోగాన్ని అందిస్తున్నాయి. వీరికి విశేషమైన ఫలితాలను, రాజ భోగాలను అందించనున్నాయి. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభ రాశి వారికి గజకేసరి రాజయోగం తో పాటు బుధాదిత్య రాజయోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. ఈ రాశి వారు మట్టి పట్టుకున్న బంగారమే అవుతుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసే వారికి ఈ సమయంలో ఊహించని లాభాలు కలుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఈ సమయం వృషభ రాశి వారికి అదృష్ట సమయం.
కర్కాటక రాశి
ఈ రాశి వారికి పంచమ, లాభ స్థానంలో గజకేసరి, బుధాదిత్య రాజయోగాలు ఏర్పడుతున్నాయి. వీటి కారణంగా ఈ రాశికి చెందిన వారి వృత్తి ఉద్యోగాలలో సానుకూల ఫలితాలు వస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతాయి. సమాజంలో సర్వత్ర గుర్తింపు వస్తుంది.
సింహరాశి
సింహ రాశి వారికి నాలుగవ మరియు 10వ స్థానంలో గజకేసరి, బుధాదిత్య రాజయోగాలు ఏర్పడుతున్నాయి. దీని కారణంగా సింహరాశికి చెందిన వ్యక్తులకు కీలకమైన శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగాలు చేసే వారికి మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారాలు చేసే వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది. గృహ వాహన యోగాలు ఉన్నాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో బుధాదిత్య రాజయోగం, సప్తమ స్థానంలో ఉన్న గజకేసరి రాజయోగాన్ని వీక్షిస్తుంది. దీని కారణంగా వృశ్చిక రాశి వారికి ఉద్యోగంలో హోదా పెరుగుతుంది .వ్యాపారాలు చేసే వారు ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కుటుంబంలో సుఖసంతోషాలు ఉంటాయి.. ఆస్తి వివాదాలు పరిష్కారం కావడం వల్ల మనశ్శాంతిగా జీవిస్తారు.
మకర రాశి
మకర రాశి వారికి పంచమ మరియు లాభ స్థానంలో గజకేసరి, బుధాదిత్య రాజయోగాలు ఏర్పడుతున్నాయి, దీని కారణంగా మకర రాశి జాతకులకు ఏ పని చేసినా కలిసి వస్తుంది, వృత్తి వ్యాపారాలు చేసుకునే వారికి ఆర్దిక స్థిరత్వం వస్తుంది, ఈ సమయం మకర రాశి జాతకులకు అన్ని విధాలుగా లాభదాయకమైన సమయం.
కుంభరాశి
కుంభ రాశి వారికి నాలుగవ, 10వ స్థానంలో గజకేసరి, బుధాదిత్య రాజయోగాలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల కుంభ రాశి జాతకులకు వ్యక్తిగత, ఆస్తి సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది. గృహ వాహన యోగాలు ఉన్నాయి. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. విదేశాలలో పనిచేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications