Ganesh chaturthi 2023: గణపతి విగ్రహాన్ని ఆ దిశలో పెడితే ఆర్థిక ఇబ్బందులు!!
హిందూమతంలో వినాయక చవితికి చాలా విశిష్టమైన స్థానం ఉంది. హిందూ దేవుళ్లలో అగ్ర పూజలు అందుకునే గణ నాధుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎప్పుడైనా మనం ఏదైనా శుభకార్యాలు ప్రారంభించే ముందు గణపతిని తప్పనిసరిగా పూజిస్తూ ఉంటాం. అయితే వేదాలలోనే కాకుండా వాస్తు శాస్త్రంలో కూడా ఇంట్లో వినాయకుడి విగ్రహం లేదా చిత్రాన్ని ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం, గణపతిని ఇంట్లో ప్రతిష్టించడం ప్రతికూల శక్తుల నుండి ఇంటిని కాపాడుతుంది. గణేశుడిని పూజించటం వల్ల ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం ఉంటుంది. వాస్తు ప్రకారం, వినాయక చవితి నాడు మాత్రమే కాదు ఇంట్లో గణపతి విగ్రహం లేదా చిత్రాన్ని ఉంచేటప్పుడు దిశను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే గణపతి విగ్రహాన్ని తప్పుగా ఉంచినట్లయితే మనం జీవితంలో ఊహించని అనేక ఇబ్బందులను,ముఖ్యంగా ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.

వాస్తు ప్రకారం, గణేశుడి విగ్రహాలను ఏ విధంగా పెట్టాలో కొన్ని సూచనలు ఇక్కడ చేయబడ్డాయి. వాస్తు శాస్త్రం ప్రకారం వినాయకుని విగ్రహాన్ని ఇంటి ఈశాన్య మూలలో ఉంచడం చాలా మంచిది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు గణేశుడి విగ్రహాన్ని ఉత్తర దిశలో కానీ, ఇంటి ద్వారానికి అభిముఖంగా కానీ పెట్టటం శుభాలను ఇస్తుంది.
ఇక గణపతి విగ్రహాన్ని ఇంటికి దక్షిణం వైపు మరిచిపోయి కూడా ప్రతిష్టించకూడదని వాస్తు నిపుణులు చెప్తున్నారు. అలా పెడితే ప్రతికూల ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు. దక్షిణం దిశలో వినాయకుడి విగ్రహాలను పెడితే ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయని అంటున్నారు. అంతేకాదు మరుగుదొడ్లు, డస్ట్‌బిన్‌లు, స్టోర్ రూమ్‌లు, మెట్ల కింద మొదలైన గోడలకు గణపతి చిత్రపటాన్ని, గణపతి విగ్రహాన్ని పెట్టకూడదని చెప్తున్నారు.
అంతేకాదు ఇంట్లో ఒక్క గణేష్ విగ్రహాన్ని మాత్రమే ఉంచుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఒకటి కంటే ఎక్కువ వినాయక విగ్రహాలు ఇంట్లోకి వచ్చే సానుకూల శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటాయని చెబుతున్నారు. అందుకే ఇంట్లో రకరకాల గణేషుని విగ్రహాలకు బదులు, ఒకే ఒక్క లలితాసనంలో కూర్చున్న వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications