లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులు.. ఈ రాశులవారికి ఎప్పటికీ ధనయోగం!
సనాతన ధర్మంలో లక్ష్మీదేవికి ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. సిరిసంపదలను ఇచ్చే లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ఆ జాతకులు సంతోషంగా జీవిస్తారు. లక్ష్మీదేవిని ప్రతినిత్యం పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని, సిరి సంపదలు ప్రాప్తిస్తాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు. లక్ష్మీదేవి కటాక్షం ఉంటే నిరుపేద కూడా కుబేరుడు అవుతాడు.
లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులు
సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి కొన్ని రాశుల వారి పైన ప్రత్యేక ప్రేమను చూపిస్తుందని చెప్తారు. లక్ష్మీదేవి కటాక్షం కారణంగా వారికి ఎప్పటికీ ధనానికి లోటు లేకుండా ఉంటుందని చెబుతారు. లక్ష్మీదేవి కటాక్షంతో సిరిసంపదలకు లోటు లేకుండా జీవించే ఆ రాశుల వారు ఎవరో తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభరాశి జాతకులపైన లక్ష్మీదేవి ప్రత్యేకమైన ప్రేమను చూపిస్తుంది. 365 రోజులు వృషభ రాశి జాతకులు లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహంతో డబ్బుకు లోటు లేకుండా జీవిస్తారు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా, సంతోషమైన జీవితాన్ని గడుపుతారు. ఒకవేళ ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వాటి నుండి ఇట్టే బయటపడతారు. వృషభ రాశి వారికి లక్ష్మీదేవి అన్ని విధాల శుభాలను చేకూర్చే తల్లి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులపైన లక్ష్మీదేవి ప్రత్యేకమైన ప్రేమను చూపిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కారణంగా కర్కాటక రాశి వారు 365 రోజులు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా జీవిస్తారు. సమస్యలు ఏవైనా ఇట్టే పరిష్కరించుకొని కర్కాటక రాశి జాతకులు ముందుకు సాగుతారు. ఆ విధంగా లక్ష్మీదేవి వారిని అనుగ్రహిస్తుంది.
సింహరాశి
లక్ష్మీదేవి సింహరాశి జాతకులపైన తన ప్రేమను చూపిస్తుంది. సింహరాశి జాతకులు లక్ష్మీ కటాక్షం తోటి కావలసిన డబ్బులను ఎప్పటికీ పొందుతూనే ఉంటారు. మీరు 365 రోజులు ఆర్థికంగా బలంగానే ఉంటారు. సింహరాశి వారి కోపాన్ని అదుపులో పెట్టుకుంటే వారికి లక్ష్మీదేవి మరింత సానుకూల ఫలితాలను ఇస్తుంది.
తులారాశి
తులా రాశికి అధిపతి శుక్రుడు. ఇక శుక్రుడి రాశి అయిన తులారాశి పైన లక్ష్మీదేవి అనుగ్రహం కచ్చితంగా ఉంటుంది. లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహంతో తులారాశి జాతకులు ఏ పని చేసిన విజయాలను సాధిస్తారు. వీరికి లక్ష్మీదేవి కటాక్షం మెండుగా ఉంటుంది.
వృశ్చిక రాశి
లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహంతో వృశ్చిక రాశి జాతకులు అదృష్టవంతులుగా మారుతున్నారు. 365 రోజులు లక్ష్మీదేవి వీరికి అండగా ఉండి సిరిసంపదలను ఇస్తుంది. వృశ్చిక రాశి జాతకులు కష్టపడి పని చేస్తే మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందే వీలుంటుంది. లక్ష్మీదేవి వృశ్చిక రాశి వారికి అన్ని విధాల శుభాలను చేకూరుస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications