సూర్యుడి దయవల్ల 2026లొ ఈ రాశులకు గోల్డెన్ డేస్
గ్రహాలకు అధిపతి అయిన సూర్యభగవానుడు ప్రస్తుతం వృశ్చిక రాశిలో ఉన్నాడు. డిసెంబరు మూడో తేదీన కేతువుకు సంబంధించిన నక్షత్రంలోకి, 16వ తేదీన ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. కేతువు నక్షత్రానికి బుధుడు అధిపతి కావడంతో సూర్యుడితో సన్నిహిత సంబంధాలుంటాయి. ధనుస్సు రాశిలోకి త్వరలోనే శుక్రుడు కూడా ప్రవేశించబోతున్నాడు. ఈ రెండు గ్రహాల కలయికతో కొన్ని రాశులవారి జీవితంలో సంపద, సంతోషం, అనుబంధాలు నెలకొంటాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.
మేష రాశి
వీరికి సూర్యుడి నుంచి సంపూర్ణమైన సహకారం అందుతుంది. కొత్తగా బాధ్యతలు చేపడతారు. జీవితం పరుగులు తీస్తుంది. కొంతకాలంగా ఎదుర్కొంటున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా ఉద్యోగులకు ప్రమోషన్ లభించి ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. అంతేకాకుండా వీరి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి.

కర్కాటక రాశి
ఈ రాశివారు భౌతికంగా అనేక సుఖాలను అనుభవిస్తారు. ఇంట్లో, బయట వీరికి అందరి నుంచి మద్దతు దొరుకుతుంది. ఐటీ రంగంలో ఉన్నవారు, కమ్యూనికేషన్స్, రచన, మీడియా రంగాల్లో ఉన్నవారికి ఈ సమయంలోనే ప్రమోషన్స్ వస్తాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అవి కూడా వీరికి ఆర్థిక లాభాలను తెచ్చిపెట్టే విధంగా ఉంటాయి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి సూర్యుడిని పూజించడంవల్ల అనుకున్న పనులు తొందరగా నెరవేరుతాయి.
సింహ రాశి
ఈ రాశివారిలో సానుకూల ఆలోచనలు పెరిగి అన్నీ సానుకూలంగా ఆలోచించడం మొదలుపెడతారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి బదిలీ అవుతుంది లేదంటే పదోన్నతి లభిస్తుంది. అలాగే సంపద కూడా పెరుగుతుంది. అన్ని పనులు చేయగల సామర్థ్యాన్ని సంతరించుకోవడంతో ఆత్మవిశ్వాసంతో వ్యవహరించి మంచి పేరు సంపాదించుకుంటారు. ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడి మంత్రాన్ని జపించండి. దీనివల్ల శరీరం, మనసు బలోపేతమవుతాయి. దీనివల్ల అన్నిరకాల వ్యాధులు నిర్మూలించబడతాయి. ఈ పనిని అన్ని రాశుల వారు చేయవచ్చు.












Click it and Unblock the Notifications