వాశి రాజయోగం 2023: మూడు రాశుల వారి బతుకు బంగారం; మీరున్నారా?
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అనేక గ్రహాల కదలికలు ఎంతోమంది జాతకాలపై అనుకూల మరియు ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి. కొన్ని గ్రహాల కదలికలు కొన్ని రాశుల వారికి విపరీతమైన అదృష్టాన్ని, ధన లాభాన్ని కలిగిస్తాయి. గ్రహాల చలనం వల్ల, ఇతర గ్రహాలతో సంయోగం చెందడం వల్ల కలిగే కొన్ని యోగాలు కూడా కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెస్తాయి.
ఈ సంవత్సరం అటువంటి అదృష్ట యోగం ఉన్న రాశులు ఏమిటి? ముఖ్యంగా సూర్యుడు వల్ల ఏర్పడిన అద్భుతమైన వాశి రాజయోగం ఏ రాశుల వారి జీవితాలపై కనక వర్షం కురిపిస్తుంది? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. గ్రహాలకు రాజు అయిన సూర్యుడు సింహరాశిలో ప్రవేశించడం వల్ల వాశి రాజయోగం ఏర్పడుతుంది. కర్కాటక రాశిలో ఉన్న సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించడంతో ఆగస్టు 16వ తేదీన వాశి రాజయోగం ఏర్పడుతుంది.

మూడు అదృష్ట రాశులపై తన ఆశీర్వాదాలను కురిపించడానికి సిద్ధంగా ఉన్న సూర్యుడి శుభ ఆశీస్సులతో వాశి రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా మూడు రాశుల వారి జీవితాలు బంగారుమయంగా మారుతాయి. సింహరాశిలో సూర్యుడు ఉండే నెలరోజులపాటు వీరిని అదృష్టం వరిస్తుంది.
వాశి రాజయోగం కారణంగా సింహరాశి వారి జీవితంలో గణనీయమైన పురోగతి కనిపిస్తుంది. సింహ రాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యక్తిత్వం వికసిస్తుంది. వాశి రాజయోగం వారి ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంది. సింహ రాశి వారి కుటుంబ జీవితం, వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. సింహ రాశి వారికి వ్యాపారంలో లబ్ధి జరుగుతుంది. వ్యాపార సంస్థలు పురోగతిని సాధిస్తాయి.
వాశి రాజయోగం కారణంగా వృశ్చిక రాశి వారి జీవితం బాగుంటుంది. జీవితంలో సానుకూలమైనటువంటి మార్పులు సంభవిస్తాయి. అత్యంత శక్తివంతమైన వాశి రాజయోగం వల్ల వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితంలో విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల లోను సానుకూలత ఉంటుంది. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. పూర్వీకుల నుండి ఊహించని ఆస్తి వచ్చి పడుతుంది. మీ జీవితం ఆనందంగా సాగుతుంది. ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి, సంతృప్తిగా, సంతోషంగా జీవించడానికి ఈ సమయం దోహదం చేస్తుంది.
వాశి రాజయోగం ధనుస్సు రాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. మీ ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి. వృత్తి వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఏ పని చేసినా విజయం తప్పక లభిస్తుంది. ఈ సమయంలో ఉల్లాసకరమైన జీవితాన్ని గడుపుతారు. చదువుకోవాలని ఆకాంక్ష ఉన్నవారికి, విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఇది సరైన సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications