బాబా వంగా ఎప్పుడో చెప్పిన శుభవార్త.. ఈ నాలుగు నెలలు వీరిదే జాక్ పాట్!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం కారణంగా ద్వాదశ రాశుల వారి జాతకాలు ఏ విధంగా ఉంటాయో జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తారు. అయితే బల్గేరియా కు చెందిన ప్రసిద్ధ జ్యోతిష్యులు బాబా వంగ చాలా సంవత్సరాల క్రితమే అనేక భవిష్యత్తు అంచనాలను పేర్కొన్నారు. ఆమె చెప్పినవి దాదాపు నిజమయ్యాయి.
2025 సంవత్సరంలో అదృష్టం కలిసి వచ్చే రాశులు
బాబా వంగా ఏం చెప్పినా నిజమే అవుతుందని చాలామంది భావిస్తారు. ఈ క్రమంలో 2025 సంవత్సరానికి సంబంధించి ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో బాబా వంగ వివరించారు. బాబా వంగ జ్యోతిష్య అంచనాల ప్రకారం 2025 సంవత్సరంలో అదృష్టం కలిసి వచ్చే రాశుల గురించి తెలుసుకుందాం.

వృషభ రాశి
బాబా వంగ జ్యోతిష్య అంచనా ప్రకారం వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. వృషభ రాశి జాతకులు ఏ పని చేసిన సానుకూల ఫలితాలు వస్తాయి. మీరు ఈ సమయంలో గొప్ప పురోగతిని సాధిస్తారు. కష్టానికి తగిన ఫలితం వస్తుంది. చాలాకాలంగా ఇబ్బంది పెట్టిన సమస్యలు ఈ సమయంలో పరిష్కారం అవుతాయి.గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ నాలుగునెలలు వృషభరాశి వారికి అన్ని సువర్ణ అవకాశాలే వస్తాయి.
మిధున రాశి
బాబా వంగ జ్యోతిష్య అంచనాల ప్రకారం మిధున రాశి జాతకులు బుధుడి అనుగ్రహంతో బ్రహ్మాండంగా జీవిస్తారు. ఈ సమయంలో వీరి తెలివితేటలు, ఆలోచనాశక్తి మరింత పెరుగుతాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారు లాభాలను గడిస్తారు. డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు దూరమవుతాయి. కష్టపడి పని చేసేవారు బాగా డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. కొత్త ఆలోచనలతో ముందుకు వెళతారు. ఈ సమయంలో మిధున రాశి జాతకులు ఆత్మవిశ్వాసంతో అన్నింట విజయాలను సాధిస్తారు.
కుంభరాశి
బాబా వంగ జ్యోతిష్య అంచనాల ప్రకారం కుంభరాశి జాతకులు శని అనుగ్రహం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. వీరికి ఈ సమయంలో కొత్త అవకాశాలు కలుగుతాయి. వర్తక, వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. కుంభ రాశి వారి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. సుఖ సంతోషాలతో నిండిపోయి ఉంటుంది. మరింత ఉన్నత స్థాయికి కుంభ రాశి వారు ఎదగడానికి అవకాశం ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications