సెప్టెంబర్ 6న గ్రహణ యోగంతో ఈ రాశులవారి జీవితం అల్లకల్లోలం!

సెప్టెంబర్ మాసం జ్యోతిషశాస్త్రంలో చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. సెప్టెంబర్ మాసంలో ప్రధాన గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాలను మార్చనున్నాయి. సెప్టెంబరు మాసంలో సూర్య, చంద్ర గ్రహణాలు కూడా సంభవించబోతున్నాయి. సెప్టెంబర్ మాసంలో చంద్రుడు మకర రాశి నుండి కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే రాహువు కుంభ రాశిలో ఉంటాడు.

గ్రహణ యోగం.. అదృష్ట రాశులు
రాహువు, చంద్రుడు కుంభరాశిలో సంయోగం చెందడం వల్ల గ్రహణ యోగం ఏర్పడుతుంది. పంచాంగం ప్రకారం చంద్రుడు సెప్టెంబర్ 6వ తేదీన ఉదయం 11. 21 నిమిషాలకు కుంభరాశి లోకి ప్రవేశిస్తున్నాడు. ఈ గ్రహణ యోగం శుభ యోగంగా పరిగణించబడదు. చంద్ర రాహువుల కారణంగా ఏర్పడే ఈ గ్రహణ యోగంతో కొన్ని రాశుల వారు అల్లకల్లోలాన్ని చూస్తారు. ఏ పని సక్రమంగా జరగదు. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

Grahana Yoga will disrupt the lives of these zodiac signs including Leo

సింహరాశి
సింహ రాశి జాతకులకు గ్రహణయోగం కారణంగా అశుభ ఫలితాలు వస్తాయి. సెప్టెంబర్ 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ గౌరవానికి భంగం కలిగే అవకాశం ఉంది. వ్యాపారాలు చేసేవారు ఏ పని చేసినా సరైన ఫలితాలు రావు. ఈ సమయంలో సింహ రాశి వారు ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.

తులారాశి
తులారాశి వారికి గ్రహణ యోగం కారణంగా కష్టాలు నష్టాలు రాబోతున్నాయి. సెప్టెంబర్ ఆరవ తేదీ నుండి 8వ తేదీ వరకు తులారాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఈ సమయంలో ధైర్యాన్ని కోల్పోకుండా భగవంతుడి ఆరాధన చేస్తే కాస్త ప్రతికూలతల నుంచి ఉపశమనం లభిస్తుంది. తులారాశి జాతకులు ఈ సమయంలో ఏది చేసినా సక్రమంగా జరగదు. కనుక పెద్ద పెద్ద పనులు పెట్టుకోకుండా ఉంటే మంచిది.

మీనరాశి
మీన రాశి వారికి గ్రహణ యోగం కారణంగా ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీనరాశి జాతకులు ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. మీన రాశి వారు ఈ సమయంలో ఒత్తిడితో ఇబ్బంది పడతారు. ఇంటి వాతావరణం కూడా అల్లకల్లోలంగా ఉంటుంది. ఏ పని చేసిన ప్రతికూల ఫలితాలతో ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి జాగ్రత్త.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+