జాతకంలో గురు మహాదశ ఉంటే 19 ఏళ్లు మీరే కింగ్!
కాలానుగుణంగా గ్రహాలు తమ రాశులను మారుస్తుంటాయి. తద్వారా శుభ లేదా అశుభ యోగాలు ఏర్పడతాయి. ప్రతి గ్రహానికి మహాదశ ఉంటుంది. జాతకంలో గ్రహాల స్థానాలను బట్టి ఈ మహాదశ శుభ మరియు అశుభ ఫలితాలను ఇస్తుంది. ఇప్పుడు మనం గురు మహాదశ గురించి చెప్పుకుందాం. బృహస్పతి మహాదశ 16 సంవత్సరాలు ఉంటుంది. ఏ వ్యక్తి జాతకంలో గురుడు బలంగా ఉంటాడో అతనికి సంపదకు, సమాజంలో గౌరవానికి లోటుండదు. ఆ వ్యక్తి 16 సంవత్సరాలు రాజులా బతుకుతాడు. ఎవరి జాతకంలో గురుడు బలహీనంగా ఉంటాడో వారు బృహస్పతి మహాదశ సమయంలో పలు సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది.
గురు మహాదశ శుభ ప్రభావం : గురుడు ఏ వ్యక్తి జాతకంలో శుభ స్థానంలో ఉంటాడో వారి కెరీర్ బ్రహ్మాండంగా ముందుకు సాగుతుంది. డబ్బుకు లోటు లేకుండా చాలా జ్ఞానాన్ని కలిగి ఉంటారు.
సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. సంతానం లేనివారికి సంతానప్రాప్తి ఉంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులతోపాటు ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే వీరిలో దానగుణం ఎక్కువగా ఉంటుంది.

అశుభ ప్రభావం : ఎవరి జాతకంలో బృహస్పతి అశుభ స్థానంలో ఉంటాడో వారు కెరీర్ లో ఇక్కట్లకు గురవ్వాల్సి ఉంటుంది. వీరికి భగవంతుడిపై నమ్మకం ఉండదు. అనారోగ్యం బారిన పడటంతోపాటు వీరి వివాహానికి అడ్డంకులేర్పడతాయి. సంతానం కలగదు.
పరిహారం:
బృహస్పతి బలహీనంగా ఉంటే బలపడటానికి కొన్ని చర్యలు చేపట్టాలి. గురువారం ఉపవాసం ఉండి ఆ రోజు చేసినది ఏదైనా తింటే శుభం జరుగుతుంది. ఆరోజు బృహస్పతితోపాటు విష్ణువును కూడా పూజించడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. గురువారం పేదలకు దానం చేయడంతోపాటు అరటిచెట్టును పూజించడంవల్ల మంచి జరుగుతుంది.












Click it and Unblock the Notifications