మరోవారంలో గురుపౌర్ణమి.. ఇలా చేయండి.. సంపద వృద్ధి చెందుతుంది!!

ప్రతీ సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజును గురుపూర్ణిమగా జరుపుకుంటాము. గురుపూర్ణిమకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈ సంవత్సరం జులై 20 రాత్రి నుండి 21వ తేదీన కూడా గురు పూర్ణిమను జరుపుకోనున్నారు. గురుపూర్ణిమ విష్ణువును, గురువును పూజించే సుదినం . ఈసారి గురుపౌర్ణమి రోజున కొన్ని పనులు చేస్తే కచ్చితంగా ఐశ్వర్యం వస్తుంది. వ్యాపారంలో పురోగతి సాధించడానికి అవకాశం ఉంటుంది.

గురు పూర్ణిమ నాడు ఇంట్లో ఇలా చెయ్యండి
చాలామంది వ్యాపారంలో ఎంత కష్టపడినా ఫలితం లేక బాధపడుతూ ఉంటారు. అయితే అలాంటి వాళ్ళు ఈ ఏడాది గురుపూర్ణిమ నాడు వ్యాపార వృద్ధికి కొన్ని పనులు చేస్తే మంచిదని చెప్తున్నారు. అప్పుడే వ్యాపార వృద్ధి బాగా జరుగుతుంది. గురు పూర్ణిమ నాడు ఇంట్లో గురు యంత్రాన్ని ప్రతిష్ఠించి ప్రతి గురువారం పూజిస్తే మంచి జరుగుతుంది. గురు పౌర్ణమి నాడు జాతకంలో బృహస్పతి బలంగా మారుతాడు. పురోగతి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Guru purnima 2024 do these things for wealth on Guru purnima

గురు పూర్ణిమ దానాలతో వ్యాపారాభివృద్ధి
గురు పూర్ణిమ పర్వదినాన ఇంట్లో ఒక దిక్కును శుభ్రం చేస్తే మంచిది. ఈశాన్య దిక్కు గురు గ్రహానికి సంబంధించింది కావడంతో, ఈశాన్య దిక్కును శుభ్రపరిచి నెయ్యి దీపాన్ని వెలిగిస్తే కూడా వ్యాపారంలో పురోగతి వస్తుందని చెప్తున్నారు. గురుపౌర్ణమి నాడు పసుపు రంగు దుస్తులు, పసుపు రంగు పండ్లు, స్వీట్ లు, కుంకుమ పువ్వు, నెయ్యి, ఇత్తడి వస్తువులను దానం చేయడం వల్ల వ్యాపారంలో పురోగతికి అవకాశం ఉంటుంది.

గురుపూర్ణిమ నాడు గురుబలం పెరగాలంటే ఇలా చెయ్యాలి
అంతేకాదు గురుపౌర్ణమి రోజున గురు బలం పెరగాలంటే , జీవితం సంతోషంగా సాగాలంటే గురువులను పూజించాలి. ఆ రోజున గురువును భోజనానికి ఆహ్వానించి, మంచి భోజనం పెట్టి ఆతిధ్యం ఇవ్వాలి. గురువుకు దక్షిణ ఇచ్చి ఆశీస్సులు పొందడం ద్వారా కూడా గురు గ్రహం బలపడుతుంది. ఫలితంగా వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది.

గురు పూర్ణిమకు మెరుగైన ఫలితాలు కావాలంటే
గురుపౌర్ణమి రోజున విష్ణుమూర్తిని ఆరాధించినా, విష్ణు సహస్ర నామాన్ని పారాయణం చేసిన కూడా మంచి ఫలితం ఉంటుంది. శివుడిని పూజించినా, దత్తాత్రేయుడిని ఆరాధించినా మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి గురు పూర్ణిమ నాడు తప్పక పైన చెప్పిన పనులను చేస్తే గురు పూర్ణిమ మెరుగైన ఫలితాలను ఇస్తుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+