హనుమాన్ జయంతి.. చెయ్యాల్సినవి, చేయకూడనివి ఇవే!!
రేపు హనుమాన్ జయంతి. హిందూ క్యాలెండర్ ప్రకారం హనుమాన్ జయంతి ఏప్రిల్ 23 తెల్లవారుజామున 3 గంటల 25నిమిషాలకు ప్రారంభమై, ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 5 గంటల 18నిమిషాలకు ముగుస్తుంది. హనుమాన్ జయంతి అంటే హనుమంతుడి పుట్టినరోజు. హిందూ మతంలో హనుమాన్ జయంతికి చాలా విశిష్టమైన స్థానం ఉంటుంది. హనుమాన్ జయంతి రోజు ఎవరైతే హనుమంతుడిని విశేషంగా పూజిస్తారో వారికి శుభాలు జరుగుతాయని, ఆరోగ్యం ఉంటుందని చెబుతున్నారు.
హనుమాన్ జయంతినాడు ఇవి తినకండి
అయితే హనుమాన్ జయంతి రోజున హనుమంతుని నిష్టతో పూజించేవారు కొన్ని తప్పులను అస్సలు చేయకూడదని చెబుతున్నారు. హనుమాన్ జయంతి రోజు పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు. హనుమంతునికి మాంసాహారం ఇష్టముండదు. హనుమంతుడు శాకాహారి కాబట్టి, ఆయనకి ఇష్టమైన శాకాహారాన్ని మాత్రమే తినాలి. ఇంకా చెప్పాలంటే వీలైనంత వరకు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నం చేయాలి. హనుమాన్ జయంతి రోజున మద్యం పొరపాటున కూడా ముట్టుకోకూడదు.మద్యపానం చేస్తే హనుమంతునికి ఆగ్రహం వస్తుంది.

హనుమాన్ పూజ ఇలా చెయ్యకండి
విరిగిపోయిన హనుమంతుడి విగ్రహాన్ని లేదా, చిరిగిపోయిన హనుమంతుని చిత్రపటాన్ని హనుమాన్ జయంతి నాడు పూజించకూడదు. దానిని దేవాలయంలో కానీ, పవిత్ర నదిలో కానీ నిమజ్జనం చేయాలి. హనుమాన్ జయంతి రోజు హనుమంతుడి మంచి విగ్రహాన్ని తీసుకువచ్చి ఇంట్లో పూజాధికాలు చేయాలి. హనుమంతుడికి పొరపాటున కూడా పంచామృతం నైవేద్యంగా పెట్టకూడదు.
హనుమాన్ కు ఇవి ఇష్టం ఉండవు.. ఏం చెయ్యాలంటే
హనుమాన్ కు అభిషేకం చేయకూడదు. హనుమంతునికి ఇష్టమైన సింధూర లేపనం చెయ్యాలి. తమలపాకుల దండలను హనుమాన్ చాలా ఇష్టంగా స్వీకరిస్తాడు కనుక తమలపాకు దండలను వేయాలి. హనుమంతుని పూజించేందుకు తెలుపు, నలుపు రంగు దుస్తులు ధరించడం మంచిది కాదు. హనుమాన్ జి కి ఇష్టమైన ఎరుపు, నారింజ, పసుపు రంగు దుస్తులు ధరించాలి.
హనుమాన్ జయంతి నాడు ఇలా ఉండండి
మరిముఖ్యంగా హనుమంతునికి ఇష్టమైన కాషాయం రంగు దుస్తులు వేసుకుంటే చాలా మంచిది. హనుమాన్ జయంతి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండలేని వాళ్ళు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ఈరోజు సాల్ట్ తినకూడదు. ఇలా చెయ్యాల్సినవి, చెయ్యకూడనివి తెలుసుకుని తదనుగుణంగా హనుమాన్ జయంతి జరుపుకుంటే చాలా మంచిది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications