హనుమాన్ జయంతి 2025.. హనుమంతుడికి ఇష్టమైన ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే!!
ఏప్రిల్ 12 వ తేదీ శనివారం నాడు హనుమాన్ జయంతి. హనుమాన్ జయంతి పర్వదినం హిందువులందరికీ శుభదినంగా భావిస్తారు. అయితే హనుమాన్ జయంతి పర్వదినం నాడు హనుమంతుడికి ఇష్టమైన కొన్ని రాశుల గురించి, హనుమంతుడి కటాక్షం ఉండే రాశుల గురించి తెలుసుకుందాం. హనుమాన్ కటాక్షం కారణంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు వస్తాయి. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.
మేష రాశి
హనుమంతునికి ఇష్టమైన రాశులలో మేషరాశి కూడా ఒకటి. మేషరాశి జాతకులు హనుమంతుడి ఆశీర్వాదంతో మంచి ఫలితాలను చూస్తారు. ఏ పనైనా యిట్టె చేస్తారు. వీరికి సంకల్ప బలం ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో వచ్చే కష్టాలు కూడా వారు సులభంగా పరిష్కరించుకుంటారు. మేషరాశి జాతకులు మంగళవారం రోజు హనుమంతుడిని పూజించడం వల్ల వారికి శుభాలు జరుగుతాయి. బాధలన్నీ తొలగిపోయి ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కుతారు.

సింహరాశి
హనుమంతుడికి ఇష్టమైన రాశులలో సింహరాశి కూడా ఒకటి . సింహరాశి జాతకులు హనుమాన్ దయతో సంతోషంగా జీవిస్తారు, వారిపై హనుమంతుడి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. సింహరాశి జాతకులు ఏ పని చేపట్టిన ఆ పని సక్సెస్ కావడానికి హనుమంతుడు కూడా ఒక కారణం. మంగళ, శనివారాల్లో హనుమంతుడిని పూజించడం వల్ల సింహ రాశి జాతకులకు శుభప్రదంగా ఉంటుంది. సింహరాశి జాతకులకు ధనం కొదువ లేకుండా హనుమంతుడు చూస్తాడు.
వృశ్చిక రాశి
హనుమంతుడికి ఇష్టమైన మరొక రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి పైన కూడా హనుమంతుడి కటాక్షం పుష్కలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో పురోభివృద్ధి సాధిస్తారు. చేపట్టిన అన్ని పనులు హనుమంతుడి దయతో సఫలమవుతాయి. ఈ రాశి వారి ఆర్థిక దృక్పథం చాలా బలంగా ఉంటుంది. నిస్వార్ధంగా ఉండే వారికి హనుమంతుడి దయ తప్పక ఉంటుంది. జీవితంలో ఎప్పుడు డబ్బుకు లోటు లేకుండా ఉంటారు.
కుంభరాశి
హనుమంతుడు అమితంగా ఇష్టపడే మరొక రాశి శని కుంభరాశి. హనుమంతుడి దయ కుంభ రాశి జాతకులకు కూడా పుష్కలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. సమస్యలు వచ్చినప్పటికీ వాటిని పరిష్కరించుకునే శక్తి హనుమంతుడు మీకు ఇస్తారు. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. మంగళవారం రోజు ఆంజనేయ దండకం చదవడం వల్ల శ్రేయస్సు, సంతోషం కలుగుతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications