కుంభరాశి, మీన రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాజయోగాలను ఏర్పరుస్తుంటాయి. అలా ఏర్పరిస్తే కొన్ని రాశులకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. అయితే మొత్తం ద్వాదశ రాశులపై ఈ ప్రభావం ఉంటుంది. ఈనెల 19వ తేదీ నుంచి పరాభవ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఏప్రిల్ నెలకు సంబంధించి కుంభరాశి, మీన రాశివారి జాతక ఫలం ఎలా ఉంటుందనే వివరాలను తెలుసుకుందాం.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శని ప్రభావం కొనసాగుతున్నప్పటికీ, గురు గ్రహం అనుగ్రహం వల్ల కొన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి.ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. తోటి ఉద్యోగులతో చిన్నపాటి విభేదాలు తలెత్తుతాయి. మాట తీరును ఈ రాశివారు అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. నెలాఖరులో కొన్ని సానుకూల మార్పులు కనిపిస్తాయి. ఖర్చులు పెరిగే సూచనలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఖర్చుచేయాలి. అనవసర ప్రయాణాల వల్ల ధనం వృథా అవుతుంది. పొదుపుపై దృష్టి పెట్టడం మంచిది.

కంటి సమస్యలు లేదా నిద్రలేమి ఇబ్బంది పెట్టవచ్చు. క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లు పాటించాలి. కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్థలు తలెత్తుతాయి. ఇద్దరూ సమన్వయంతో వ్యవహరించాలి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ నెల చాలా ఆశాజనకంగా ఉండబోతోంది. గ్రహాల అనుకూలత వల్ల పెండింగ్‌లో ఉన్న పనులు వేగంగా పూర్తవుతాయి. వృత్తిపరంగా ఈ నెల మీకు అదృష్టం కలిసి వస్తుంది. పదోన్నతులు, జీతాల పెంపునకు అవకాశాలున్నాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులు లాభాలు గడిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గతంలో ఇతరులకు ఇచ్చిన అప్పులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. విలాసవంతమైన వస్తువుల కొనుగోలుపై ఆసక్తి చూపుతారు. అలా చేయకుండా ఉంటే మంచిది. డబ్బులు మిగులుతాయి.
ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పాత అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. వ్యాయామం, యోగా పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. పిల్లల వల్ల శుభవార్తలు వింటారు. దూర ప్రాంతంలో ఉండే బంధువుల నుండి శుభవార్తలు వింటారు.












Click it and Unblock the Notifications