మేష రాశి, వృషభ రాశివారి మే నెల జాతక ఫలం
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలోనే కొన్ని అరుదైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై ఉన్నప్పటికీ కొన్ని రాశులపై అత్యధిక ప్రభావాన్ని చూపుతాయి. మే నెలలో మేషరాశిలో సూర్యుడి సంచారం ఉంది. వృషభ రాశిలో బుధుడు, శుక్రుడి సంచారం ఉంది. దీన్ని బట్టి వచ్చే నెలలో ఈ రెండు రాశులవారి జాతక ఫలం ఎలా ఉందనే వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.
మేష రాశి
మేష రాశి వారికి మే నెల అత్యంత శక్తివంతంగా ఉంటుంది. రాశ్యాధిపతి కుజుడు అనుకూల స్థితిలో ఉండటం వల్ల పనులు వేగంగా అవుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా జీతాల పెంపు సూచనలున్నాయి. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుండి పిలుపు వస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పాత బాకీలన్నీ తీరుస్తారు. విలాసాల కోసం ఖర్చు చేసేటప్పుడు నియంత్రణ లేకపోతే నష్టపోతారు. ఉత్సాహంగా ఉంటారు. ఎండ ప్రభావం వల్ల డీహైడ్రేషన్ లేదా తలనొప్పి వంటి చిన్న సమస్యలు రావచ్చు. నీళ్లు ఎక్కువగా తాగాలి. శుభకార్యాల విషయంలో కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. ఈ రాశివారికి అదృష్ట సంఖ్య 9, 1. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం లేదా హనుమాన్ చాలీసా పఠించడం శుభప్రదంగా ఉంటుంది.

వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రాశిలో బుధుడు, శుక్రుడి సంచారం వల్ల ఆలోచనలు బాగుంటాయి కానీ అమల్లో మాత్రం బాగా ఆలస్యం అవుతుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సహోద్యోగులతో చిన్న విభేదాలు తలెత్తుతాయి. సాధ్యమైనంతవరకు మౌనంగా ఉండటం మంచిది. వ్యాపారస్తులకు లాభాలు సామాన్యంగా ఉంటాయి. ఎక్కువగా ఆశించవద్దు. ఖర్చులు ఆదాయాన్ని మించిపోయే అవకాశం ఉంది. తగ్గించుకోవాలి. అనవసరమైన ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. షేర్ మార్కెట్ లో పెట్టే పెట్టుబడుల్లో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గొంతు సంబంధిత సమస్యలు లేదా థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. సరైన సమయానికి భోజనం చేయడం వల్ల మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకుంటారు. పిల్లల చదువుల విషయంలో కొంత ఆందోళన చెందుతారు. ఇంటి పనుల వల్ల శ్రమ బాగా పెరుగుతుంది. వీరికి అదృష్ట సంఖ్య: 6, 2. శుక్రవారం లక్ష్మీ అష్టోత్తరం చదవడం లేదా తెల్లటి పూలతో అమ్మవారిని పూజించడం వల్ల ప్రతికూలతలన్నీ తొలగిపోతాయి.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
నవ పంచమ రాజయోగంతో వీరు పులిపంజా చీల్చి సంపన్నులవుతారు! -
మిథున రాశి, కర్కాటక రాశి మే నెల జాతక ఫలం -
జన్మ నక్షత్రం పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం ఇంట్లో చపాతీలను లెక్కపెట్టి చేస్తే పరమ దరిద్రం -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications