మిథున రాశి, కర్కాటక రాశి మే నెల జాతక ఫలం

గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలోనే కొన్ని అరుదైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై ఉన్నప్పటికీ కొన్ని రాశులపై అత్యధిక ప్రభావాన్ని చూపుతాయి. మే నెలలో మిథున రాశి, కర్కాటక రాశివారి జాతక ఫలం ఎలా ఉందనే వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.

మిథున రాశి

మే నెల మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలనిస్తుంది. మే 15 తర్వాత పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. కార్యాలయంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. తోటి ఉద్యోగులతో చిన్నపాటి విభేదాలు రావచ్చు. నిగ్రహంగా ఉండాలి. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులకు ఇది అనుకూల సమయం కాదు. కొంతకాలం వేచిచూడాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అనవసరపు వస్తువుల కొనుగోలుకు డబ్బులు వృథా చేయొద్దు. గతంలో నిలిచిపోయిన బాకీలు తిరిగి వచ్చే సూచనలున్నాయి. మానసిక ఆందోళన, నిద్రలేమి సమస్యలు ఉంటాయి. యోగా లేదా ధ్యానం చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. జీవిత భాగస్వామితో చిన్ చిన్న మనస్పర్థలు వస్తాయి. ఓపికగా వ్యవహరించాలి. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. బుధవారం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా ఆకుపచ్చని వస్తువులను దానం చేయడం మంచిది.

Horoscope Predictions and results for these two signs Gemini and Cancer For the Month Of May

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి మే నెల చాలా అనుకూలంగా ఉంటుంది. రాజయోగం పట్టే అవకాశాలు అధికంగా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా జీతాల పెంపు ఉంటుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది. భూమి లేదా వాహన కొనుగోలుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారికి ఈ సమయం చాలా లాభసాటిగా ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొంతకాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ఆహార నియమాలు పాటిస్తే మంచి ఆరోగ్యం మీ సొంతమవుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. సోమవారం శివుడికి అభిషేకం చేయడం లేదా పాలు, బియ్యం వంటి తెల్లని వస్తువులను దానం చేయడం వల్ల శుభ ఫలితాలు అందుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+