జన్మ నక్షత్రం కృత్తిక, రోహిణి ఉన్నవారి మే నెల జాతక ఫలం
తెలుగు సంప్రదాయం, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే, దాన్నే ఆ వ్యక్తి 'జన్మ నక్షత్రం' అని పిలుస్తారు. జాతక చక్రం మొత్తం ఈ జన్మ నక్షత్రం ఆధారంగానే నిర్మించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధిపతి. కాబట్టి, పుట్టినప్పుడు చంద్రుడు ఉన్న నక్షత్రం ఆ వ్యక్తి ఆలోచనా తీరును, ప్రవర్తనను, స్వభావాన్ని నిర్ణయిస్తుంది. మనకు తెలుగులో 27 నక్షత్రాలున్నాయి.
ఇవి కాకుండా ఉత్తరాషాఢ, శ్రవణా నక్షత్రాల మధ్య సూక్ష్మమైన అభిజిత్ నక్షత్రం ఉంటుంది. శుభ ముహూర్తాల కోసం దీన్ని పరిగణనలోకి తీసుకుంటారు. నక్షత్రం మాత్రమే మొత్తం జాతకాన్ని నిర్ణయించదు. జాతక చక్రంలో ఉండే లగ్నం, ఇతర గ్రహాల స్థితి , అవి ఇచ్చే దృష్టి కూడా ఫలితాలను మారుస్తాయి. అందుకే నక్షత్రాన్ని జాతకానికి పునాదిగా తీసుకుంటారు. వ్యక్తిగత జాతకంలోని గ్రహ స్థితులు, దశలను బట్టి ఫలితాల్లో అప్పుడప్పుడు స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది.

కృత్తిక నక్షత్రం
కృత్తిక నక్షత్ర జాతకులకు మే నెల ఆత్మవిశ్వాసాన్ని, కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. సూర్యుడు మీ రాశిలో సంచరించడం వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది. వృత్తిపరంగా ఈ నెల చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఏప్రిల్ నుండి జులై మధ్య కాలం ప్రమోషన్లు లేదా కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ప్రభుత్వ సంబంధిత పనులు త్వరగా పూర్తవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. అయితే, శని మీన రాశిలో ఉండటం వల్ల అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. తగ్గించుకోవాలి. అలాగే పెట్టుబడుల విషయంలో తొందరపాటు పనికిరాదు.
కుటుంబ సభ్యులతో చిన్నపాటి వాదనలు జరుగుతాయి. మౌనంగా ఉంటే సరిపోతుంది. తండ్రి వైపు బంధువుల నుండి సహకారం లభిస్తుంది. కంటికి సంబంధించిన సమస్యలు లేదా వేడి వల్ల కలిగే అనారోగ్యాలు వస్తాయి. తగినంత నీరు తాగడం, విశ్రాంతి తీసుకోవడం అవసరం. తి ఆదివారం ఆదిత్య హృదయం పఠించడం లేదా సూర్య నమస్కారాలు చేయడం వల్ల పనుల్లో ఎదురవుతున్న అడ్డంకులు తొలగుతాయి.
రోహిణి నక్షత్రం
రోహిణి నక్షత్ర జాతకులకు మే 2026 అద్భుతమైన ఆర్థిక లాభాలను, భౌతిక సుఖాలను అందిస్తోంది. బృహస్పతి మిథున రాశిలో ఉండటం వల్ల ధన యోగం ఉంది. వ్యాపారస్తులకు ఈ నెల చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆర్ట్స్, ఫుడ్, లేదా ఫైనాన్స్ రంగాలలో ఉన్నవారికి అదృష్టం వరిస్తుంది. కార్యాలయంలో మీ సృజనాత్మకతకు ప్రశంసలు దక్కుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంపద పెరుగుతుంది. విలాసవంతమైన వస్తువుల కొనుగోలు చేస్తారు. అయితే, రాహువు ప్రభావం వల్ల పోటీదారులు మీపై కుట్రలు చేసే అవకాశం ఉంది, అప్రమత్తంగా ఉండాలి. లేదంటే భారీగా నష్టపోతారు. వైవాహిక జీవితం ప్రశాంతంగా ఉంటుంది.
సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఇంట్లో మంగళకరమైన పనులు జరుగుతాయి. శారీరక ఆరోగ్యం బాగుంటుంది. కానీ, అతిగా తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు. యోగా, ధ్యానం అలవాటు చేసుకోవాలి. శుక్రవారం రోజు లలితా సహస్రనామ పారాయణం చేయడం లేదా పేదలకు పాలు, పెరుగు దానం చేయడం శుభప్రదం.
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications