జన్మ నక్షత్రం ఆశ్లేష, మఖ ఉన్నవారి మే నెల జాతక ఫలం
తెలుగు సంప్రదాయం, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే, దాన్నే ఆ వ్యక్తి 'జన్మ నక్షత్రం' అని పిలుస్తారు. జాతక చక్రం మొత్తం ఈ జన్మ నక్షత్రం ఆధారంగానే నిర్మించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధిపతి. కాబట్టి, పుట్టినప్పుడు చంద్రుడు ఉన్న నక్షత్రం ఆ వ్యక్తి ఆలోచనా తీరును, ప్రవర్తనను, స్వభావాన్ని నిర్ణయిస్తుంది. మనకు తెలుగులో 27 నక్షత్రాలున్నాయి.
ఇవి కాకుండా ఉత్తరాషాఢ, శ్రవణా నక్షత్రాల మధ్య సూక్ష్మమైన అభిజిత్ నక్షత్రం ఉంటుంది. శుభ ముహూర్తాల కోసం దీన్ని పరిగణనలోకి తీసుకుంటారు. నక్షత్రం మాత్రమే మొత్తం జాతకాన్ని నిర్ణయించదు. జాతక చక్రంలో ఉండే లగ్నం, ఇతర గ్రహాల స్థితి , అవి ఇచ్చే దృష్టి కూడా ఫలితాలను మారుస్తాయి. అందుకే నక్షత్రాన్ని జాతకానికి పునాదిగా తీసుకుంటారు. వ్యక్తిగత జాతకంలోని గ్రహ స్థితులు, దశలను బట్టి ఫలితాల్లో అప్పుడప్పుడు స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది.

ఆశ్లేష నక్షత్రం (కర్కాటక రాశి)
ఆశ్లేష నక్షత్రంపై గ్రహాల రాకుమారుడైన బుధుడి ప్రభావం ఎక్కవు. మే నెలలో వీరికి మిశ్రమ ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. తోటి ఉద్యోగులతో చిన్నపాటి విభేదాలు వస్తాయి. నెల ద్వితీయార్థంలో అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు పెరగవచ్చు. ముఖ్యంగా ఇంటి అవసరాల కోసం లేదా వాహన మరమ్మతుల కోసం ధనం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అనవసరంగా పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. ఉదర సంబంధిత లేదా చర్మ సంబంధిత చిన్నపాటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆహారం విషయంలో నియమాలు పాటించడం మంచిది. ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా ఆకుపచ్చని వస్తువులను దానం చేయడం వల్ల మేలు జరుగుతుంది.
మఖ నక్షత్రం (సింహ రాశి)
మఖ నక్షత్రంపై ఛాయా గ్రహమైన కేతువు ప్రభావం ఎక్కువ. ఈ నెలలో మీకు శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. కార్యాలయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. గతంలో ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించే వారికి సానుకూల ఫలితాలు అందుతాయి. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. పాత బకాయిలు వసూలవుతాయి. స్థిరాస్తి లేదా భూమి కొనుగోలుకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. షేర్ మార్కెట్‌లో లాభాలున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా ధ్యానం చేయడం మంచిది. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం లేదా గణపతి ఆరాధన చేయడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి.
-
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: అనుకున్న పనులు నెరవేరతాయి.. నోరు అదుపులో ఉంచుకోవాలి -
today rashiphalalu: ఆదాయం పెరిగి ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి -
వాస్తును పాటిస్తే నిజంగానే ఆర్థికంగా కలిసొస్తుందా? రుజువులున్నాయా? -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె












Click it and Unblock the Notifications