horoscope today: వీరికి ఆకస్మిక ధనలాభాలు, సంపదలు.. మీరున్నారా?
2025 డిసెంబర్ 15 శుక్రవారం రోజు ద్వాదశ రాశుల వారి జాతక ఫలాలు ఏ విధంగా ఉన్నాయి. ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది? ఏ రాశుల వారు ప్రతికూల ఫలితాలను చూడాల్సి వస్తుంది? అనే సమాచారాన్ని ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
మేషరాశి
మేష రాశి వారికి నేడు ఆదాయం పెరుగుతుంది. గతంలో చాలా కాలంగా వేచి ఉన్న పనులలో వేగం కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి మంచి సహకారం లభిస్తుంది.

వృషభ రాశి
వృషభ రాశి జాతకులు నేడు ఆరోగ్యంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. స్నేహితులకు, కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ఇది వృషభ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది.
మిధున రాశి
మిధున రాశి వారికి నూతన అవకాశాలు వస్తాయి. ఇంటి వాతావరణం బాగుంటుంది. వర్తక వ్యాపారాలలో వృద్ధి ఉంటుంది. ఇది మిధున రాశి వారికి అదృష్ట సమయం.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు తలపెట్టిన పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల వల్ల చిన్న ఒత్తిడి చోటు చేసుకునే అవకాశం ఉంది. ఫైనాన్షియల్ విషయాలలో కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండాలి.
సింహరాశి
నేడు సింహ రాశి వారికి మానసిక శాంతి లభిస్తుంది. ప్రతిష్ట పెరుగుతుంది. ఉద్యోగాలలో మార్పు వచ్చే అవకాశం ఉంది. అయితే అది కూడా సానుకూలంగానే ఉంటుంది.
కన్యారాశి
కన్య రాశి వారి పనులు కొన్ని ఆలస్యంగా అవుతాయి. కానీ చివరికి ప్రయోజనం సంతోషదాయకంగా ఉంటుంది. ఎప్పటినుంచో వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి.
తులారాశి
తులారాశి వరకు నేడు సంబంధాలలో ఆనందాన్ని చూస్తారు. సృజనాత్మక పనులలో విజయాలను చూస్తారు. అపరిచితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. ధైర్యం పెరుగుతుంది. ఆర్థిక లాభాలు కనబడతాయి. అన్ని విధాల ఇది ప్రయోజనాలను చేకూరుస్తుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి నేడు మానసిక ప్రశాంతత ఉంటుంది. మీకు వచ్చే కొత్త ఆలోచనలు మీకు మంచి అవకాశాలను తీసుకువస్తాయి.
మకర రాశి
మకర రాశి వారికి పని వత్తిడి ఎక్కువగా ఉంటుంది. కానీ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. డబ్బులు ఆదా చేయగలుగుతారు.
కుంభరాశి
కుంభ రాశి వారికి స్నేహితుల సహాయం లభిస్తుంది. ప్రయాణాలు ఆర్థిక లాభాలను ఇస్తాయి. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా ముందుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
మీన రాశి
మీన రాశి వారికి పాజిటివ్ ఎనర్జీ ఈరోజు ఎక్కువగా ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు పురోగతిని సాధిస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.
disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications