horoscope today: నేడు ఈ రాశులవారికి కుబేర యోగం.. తగ్గేదేలే!
జ్యోతిషశాస్త్రంలో నవ గ్రహాల సంచారం వివిధ రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రతిరోజు నవగ్రహాలు వివిధ రాశులలో సంచారం చేస్తూ శుభ లేదా అశుభ ఫలితాలను చేకూరుస్తూ ఉంటారు. ఈరోజు డిసెంబర్ 11 2025. నేటి ద్వాదశ రాశుల వారి ఫలితాలను ప్రస్తుతం చూద్దాం.
మేషరాశి
మేష రాశి వారికి నేడు గ్రహబలం మిశ్రమంగా ఉంటుంది. గత అనుభవం మీకు మార్గదర్శకంగా నిలుస్తుంది. మేషరాశిలో ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగం ఆశాజనకంగా ఉంటుంది. పెద్దల సలహాలు మీకు ప్రేరణగా ఉంటుంది.

వృషభ రాశి
వృషభ రాశి వారికి ప్రతిభకు తగ్గ గుర్తింపు వస్తుంది. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది.
మిధున రాశి
మిధున రాశి వారికి ఈ రోజు బాగుంటుంది. ప్రతి పని ఆశించిన ఫలితాలను ఇస్తుంది. కొత్త ఆలోచనలు ఆదరణ పొందుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.
కర్కాటక రాశి
నేడు కర్కాటక రాశి వారికి డబ్బులు ఖర్చు చేసే విషయంలో జాగ్రత్త అవసరం. స్వల్ప ఒత్తిడి ఉన్నా మీరు ధైర్యంగా ఎదుర్కొని స్థిరపడే రోజు. కుటుంబ పెద్దల సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిది. ఉద్యోగంలో ఓర్పు మీకు విజయాన్ని ఇస్తుంది.
సింహరాశి
సింహ రాశి వారి కృషి ఫలిస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. సృజనాత్మకతకు గుర్తింపు వస్తుంది. కుటుంబంలో ఉత్సాహం, సంతోషం వెల్లివిరుస్తుంది.
కన్యారాశి
కన్య రాశి వారికి నేడు ఆత్మవిశ్వాసం బాగుంటుంది. కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి.
తులారాశి
నేడు తులా రాశి వారికి పదోన్నతులలో అవకాశం ఉంది. వ్యాపారంలో లాభదాయక మార్పులు ఉంటాయి. ధన ప్రవాహం సంతృప్తికరంగా ఉంటుంది. తులా రాశి వారి ఆర్థిక బలం పెరుగుతుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారి కృషి విజయ ద్వారాలను తెరుస్తుంది. వృశ్చిక రాశి వారి ఆర్థిక స్థితి బలపడుతుంది. కుటుంబ సహకారం ధైర్యాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గి సౌఖ్యం లభిస్తుంది.
ధనస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఆధ్యాత్మికత పెరుగుతుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారికి అన్ని విధాల మంచి జరుగుతుంది.
మకర రాశి
మకర రాశి వారికి నేడు అద్భుత ఫలితాలు వస్తాయి. ఉద్యోగం వ్యాపారం రెండిట్లోనూ విజయం సొంతమవుతుంది. కుటుంబంలో సంతోషం, సౌఖ్యం పెరుగుతుంది. ఆర్థిక బలం పెరుగుతుంది.
కుంభరాశి
కుంభరాశి జాతకులు నేడు ఏకాగ్రతతో చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో స్థిరమైన లాభాలను పొందుతారు. ఉద్యోగంలో శ్రద్ధ పెడితే ఉన్నత ఫలితాలు పొందుతారు. ఆర్థిక స్థితి బలపడుతుంది.
మీనరాశి
మీన రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరిగి ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో ప్రశంసలు లభిస్తాయి. కుటుంబంలో సౌఖ్యం నెలకొంటుంది. వ్యాపారంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications