Horoscope today: నేటినుండి వీరికి డబ్బే డబ్బు.. మహాలక్ష్మీ యోగం మహిమ!
వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాన్ని నిర్ణయిస్తాయి. డిసెంబర్ 20వ తేదీన గ్రహాల సంచారం కారణంగా ఏర్పడినటువంటి రాజయోగాల ప్రభావం ద్వాదశ రాశుల వారి జీవితాల పైన ఉంటుంది. డిసెంబర్ 19వ తేదీ రాత్రి ఏర్పడిన మహాలక్ష్మి రాజయోగం ప్రభావం కారణంగా నేడు లబ్ది పొందే రాశులు ఏమిటి? ఏ రాశుల వారు ప్రతికూల ఫలితాలను పొందుతారో తెలుసుకుందాం.
మేషరాశి
మేష రాశి వారికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. వీరికి ఆర్థికంగా లాభం జరుగుతుంది. మేష రాశి వారి ఆరోగ్యం ఈ సమయంలో మెరుగుపడుతుంది.

వృషభ రాశి
వృషభ రాశి వారికి ఖర్చులు పెరిగినా, అవసరమైన పనులు పూర్తవుతాయి. నేడు కుటుంబంలో శుభవార్తలు వింటారు.
మిధున రాశి
మిధున రాశి వారికి మాటలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయి. నేడు వీరికి స్నేహితుల సహకారం లభిస్తుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి కెరీర్లో పురోగతి ఉంటుంది. అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. మనశ్శాంతి ఉంటుంది.
సింహరాశి
సింహ రాశి వారికి దూర ప్రయాణ యోగం ఉంది. వీరికి ఈ సమయంలో అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక లాభాలు సాధ్యమవుతాయి.
కన్యారాశి
కన్య రాశి వారు నేడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి.
తులారాశి
తులారాశి జాతకులు నేడు సంతోషంగా ఉంటారు. దాంపత్య జీవితం బాగుంటుంది. కొత్త ఒప్పందాలు లాభాలను ఇస్తాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారాలలో లాభాలను పొందుతారు. రుణ సమస్యలు కొంతమేర తగ్గుముఖం పడతాయి.
ధనస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త ప్రారంభాలకు ఇది మంచి రోజు గా ఉంటుంది.
మకర రాశి
మకర రాశి వారికి పని భారం ఎక్కువగా ఉంటుంది. మకర రాశి వారు నేడు ఓర్పుతో ఉంటే మంచి ఫలితాలను పొందుతారు.
కుంభరాశి
కుంభ రాశి వారు స్నేహితుల నుంచి సహాయాన్ని పొందుతారు. నేడు వీరికి ఆదాయం పెరిగే అవకాశం కనిపిస్తుంది.
మీనరాశి
మీన రాశి వారు సృజనాత్మక పనులలో విజయాలను సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications