నేడు డబ్బు విషయంలో ఈ రాశులవారు జాగ్రత్త!!

వేద జ్యోతిషశాస్త్రంలో ప్రతి రోజుకు తనదైన ప్రత్యేకత ఉంటుంది. ప్రతిరోజు గ్రహాల మార్పు ద్వాదశ రాశుల వారికి సానుకూల, ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. నేడు మేషరాశి నుండి కన్యా రాశి వరకు వివిధ రాశుల వారి జాతకం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం.

మేషరాశి
మేష రాశి వారు చేసే పనులలో విజయం సాధిస్తారు. శత్రువులు మిత్రులు అవుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. నేడు వీరు ఆర్థికంగా బలోపేతం అవుతారు. ప్రయాణాలు ఫలవంతంగా సాగుతాయి. ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడం నేడు మేలు చేస్తుంది.

horoscope today These zodiac signs Be careful about money today

వృషభ రాశి
వృషభ రాశి వారు చిన్న ప్రయత్నంతో కూడా గొప్ప కార్యక్రమాలను పూర్తిచేస్తారు. కుటుంబం కోసం మీరు చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి. పెద్దలు చెప్పిన సూచనలతో పనులు త్వరగా పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నేడు వృషభ రాశి వారు శివారాధన చేయడం మంచిది.

మిధున రాశి
మిధున రాశి జాతకులకు నేడు మధ్యస్థంగా ఉంటుంది. రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తేనే లక్ష్యం నెరవేరుతుంది. ప్రారంభించాలి అనుకుంటున్న పనులలో ప్రయత్నం పెంచాల్సిన అవసరం కూడా ఉంది. ఆర్థికపరంగా ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త వహించాలి. వీరు శ్రీరామ నామాన్ని జపించడం మేలు చేస్తుంది.

కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులు నేడు ఆర్థికపరమైన అంశాలపై జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమ చంద్ర సంచారం కారణంగా వీరికి నేడు అనుకూలంగా లేదు. సమాజంలో గౌరవం తగ్గకుండా కాపాడుకోవాలి. ప్రారంభించిన పనులను ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మనోధైర్యంతో పూర్తి చేయాలి. శ్రీ లక్ష్మీ దేవిని స్తుతించడం శుభప్రదంగా ఉంటుంది.

సింహరాశి
సింహ రాశి వారు ఆత్మవిశ్వాసంతో పనులను పూర్తిచేస్తారు. పనులలో అవగాహనలోపం లేకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఇక నేడు వీరి ప్రయాణాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతాయి. ముఖ్యమైన విషయాలలో అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. విష్ణుమూర్తిని ధ్యానం చేస్తే మంచిది.

కన్యారాశి
కన్యా రాశి వారికి నేడు శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. వీరు ఆర్థిక ప్రగతిని సాధిస్తారు. చిన్న ప్రయత్నంతో కూడా విజయం వరిస్తుంది. కన్యారాశి జాతకులు విందులు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నేడు వీరు శివారాధన చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+