రాహు-కేతువుల నక్షత్ర సంచారం: ఈ రాశులవారికి కష్టకాలం!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో రాహు కేతు గ్రహాలను అపవిత్రమైన గ్రహాలు గాను, హాని చేసే గ్రహాలు గాను పరిగణిస్తారు. వివిధ నక్షత్రాల లోకి రాహు కేతువుల యొక్క స్థాన చలనం వల్ల అన్ని రాశుల వారి పైన ప్రభావం పడుతుంది. ఈ రెండు గ్రహాలు ఇటీవల జూన్ 2023లో పరివర్తన చెందాయి. శని యొక్క తిరోగమన చలనం రాహు కేతువుల ప్రతికూల శక్తిని మరింత పెంచింది.
శని తిరోగమనముతో పాటు కేతువు చిత్రా నక్షత్రం లోకి ప్రవేశించగా, రాహువు అశ్విని నక్షత్రం లోకి ప్రవేశించింది. రాహువు కేతువు యొక్క నక్షత్రం లోకి మారినప్పటికీ, కేతువు మంగళ నక్షత్రానికి చేరుకున్నాడు. ఇక ఈ రెండు నక్షత్రాల మార్పులు అనేక భయాలకు సంకేతంగా చెబుతారు.

జ్యోతిష్య శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ మార్పు కొన్ని రాశుల వారికి భయంకరమైన ప్రభావాన్ని చూపించనున్నాయి. కొన్ని రాశులవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని సూచన. ముఖ్యంగా రాహువు, కేతువుల నక్షత్ర సంచారం వల్ల మిధునరాశి జాతకులు ప్రతికూల ప్రభావాలను చూడాల్సి వస్తుంది. మిధునరాశి జాతకులు తమ జీవితంలో వ్యక్తిగత సంబంధాలలో సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సమయంలో ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉంది.
రాహువు, కేతువుల నక్షత్ర సంచారం తులారాశి జాతకుల సంబంధాలలో సమస్యలను తెచ్చి పెడుతుంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలని, పెట్టుబడులు పెట్టే విషయంలో ఆచితూచి వ్యవహరించాలని సూచించబడింది. ఇక రాహు కేతువుల పరివర్తన ధనుస్సు రాశి జాతకులకు కొత్త కష్టాలను తెచ్చి పెట్టవచ్చు. ధనస్సు రాశి జాతకులు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది.
ధనుస్సు రాశి వారు అకస్మాత్తుగా తీసుకునే నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ఈ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక ప్రయోజనాలు కూడా పరిమితంగానే ఉంటాయి. మకర రాశి జాతకులకు రాహు, కేతువుల ప్రభావం అనేక సవాళ్లను తెచ్చిపెడుతుంది. మకర రాశి జాతకులు కుటుంబ సంబంధాలలో సమస్యలను ఎదుర్కొంటారు. ఎంత కష్టపడినప్పటికీ సరైన ఫలితాలు రావు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కూడా దెబ్బ తినే అవకాశం ఉంది.
రాహువు, కేతువుల నక్షత్ర సంచారం మీన రాశి జాతకులకు జీవితంలో కష్టాలను తీసుకువస్తుంది. మీనరాశి జాతకులు ఆరోగ్య సమస్యల నుండి ప్రమాదాల వరకు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. జీవితంలోని ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కష్టపడి సంపాదించిన డబ్బు కూడా చేతుల్లో నుండి జారిపోతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications