Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సింహరాశి వారికి 2021-2022 శ్రీ ప్లవ నామ ఉగాది వార్షిక ఫలితాలు

గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య

మఘ 1,2,3,4 పాదములు, పుబ్బ 1,2,3,4, పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు .

How will this Ugadi year be for the people who hold Leo as Zodiac sign

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో సింహరాశి వారికి

ఆదాయం 02, వ్యయం - 14,

రాజ పూజ్యం - 02, అవమానం - 02.

* గురువు :- ఉగాది ప్రారంభం నుండి సెప్టెంబర్ 14 వరకు సప్తమ స్థానమైన ( కుంభం) లో సువర్ణ మూర్తిగా .. ఆ తర్వాత సంవత్సరం అంతా సప్తమంలో తామ్ర మూర్తిగా ఉంటాడు.

* శని :- సంవత్సరం అంతా ... షష్టమ స్థానమైన ( మకరరాశి )లో సువర్ణ మూర్తిగా ఉంటాడు.

* రాహు కేతువులు :- సంవత్సరం అంతా 10 , 4 ( వృషభ, వృశ్చిక ) రాశులలో లోహ మూర్తులుగా ఉంటారు.

How will this Ugadi year be for the people who hold Leo as Zodiac sign

ఉగాది నుండి గురువు అశుభత్వం వలన 19 నవంబర్ 2021 వరకు ఏ పని చేసిన కలిసి రాదు.

గత శార్వరి నామ సంవత్సరపు వలె కొన్ని సమస్యలతో కొనసాగును.

20 నవంబర్ 2021 నుండి గురువు శుభత్వం వలన అప్పటి నుండి యోగించును.

ఆర్ధికపరమైన నూతన అవకాశాలను కలుగజేయును.

అవివాహితులకు మంచి సంబంధాలు కుదురుతాయి .

వైవాహిక జీవితంలో సుఖసౌఖ్యాలను పొందుతారు.

చాలా కాలం నుండి వైవాహిక జీవితంలో ఎదుర్కుంటున్న సమస్యలు తొలగిపోవును.

జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాలలో కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పడుతాయి.

* శని సంవత్సరం అంతా మంచి ఫలితాలను ఇస్తాడు .

కుటుంబ మరియు వృత్తికి సంబంధించిన విషయాల్లో విజయం సాధిస్తారు.

తగాదలలో ఉన్న స్థిరాస్తి సమస్యలు మీకు అనుకూలంగా తీర్పు వచ్చే సూచనలు అధికంగా ఉన్నవి.

* రాహువు - కేతువులు సంవత్సమంతా సంపూర్ణ భాగ్యాలను కలిగిస్తారు .

విశేషమైన ధనార్జనకు అవకాశాలు ఏర్పరచును.

మాత్రు వర్గం వారి వలన లాభపడుదురు.

భూమి స్థలం లేదా గృహ నిర్మాణ ప్రయత్నాలకు ఈ సంవత్సరం అనుకూల కాలం.

* రాహు - కేతువుల వలన విద్య పరంగా విద్యార్థులకు చక్కటి ఫలితాలను ఇస్తారు.

* ( ఇతర అన్ని గ్రహ స్థానాలను ఆధారంగా ఫలితాలు ఇలా ఉండనున్నాయి. )

మీరు ఎంత సర్దుకు పోయినా.. మీరు వివాదాస్పద వ్యక్తిగానే ముద్రపడతారు.

అందరితో కలసి పనిచేయరు, ఒంటరిగానే సాధిస్తారు.

విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో వీసా, గ్రీన్ కార్డ్ లభిస్తుంది.

కేవలం మనోధైర్యం వలన మానసిక సంతృప్తి కలుగుతుంది.

బంధువులతో, సన్నిహితులతో వివాదాలు ఏర్పడే సూచనలున్నాయి.

మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు అవసరం.

ఆరోగ్య పరంగా మోకాళ్ళ నొప్పులు,

వైరస్ వలన కొంత ఆరోగ్యం చికాకు పరుస్తుంది.

రాజకీయ నాయకులకు, నటులకు, గాయకులకు సంవత్సర చివరి కాలం యోగాదాయకంగా ఉండును.

మీ మీద నరదృష్టి అధికంగా ఉంటుంది .

ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు లభిస్తాయి.

వ్యాపారాలు మంచి లాభాల బాటలో పడుతారు.

వ్యవసాయ దారులకు అన్ని పంటలు అనుకూలంగా లాభిస్తాయి.

రాజకీయ రంగం వారికి అధిస్టానం నుండి గుర్తింపు, పదవి ప్రాప్తి కలుగుతుంది.

విద్యార్ధులకు మంచి యోగం , కోరుకున్న కాలేజీలో సీటు వస్తుంది.

అనుకూలమైన శుభ ఫలితాలు పొందుటకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, సూర్య దేవుని ఆరాధన చేయండి.

సర్వేజనా: సుఖినోభవంతు ఓం శాంతి శాంతి శాంతి: .. జై శ్రీమన్నారాయణ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+