Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తులారాశి వారికి 2021 - 2022 శ్రీ ప్లవ నామ ఉగాది వార్షిక ఫలితాలు

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య

చిత్త 3, 4 పాదములవారు, స్వాతి 1,2,3,4 పాదములవారు, విశాఖ 1,2,3 పాదములులో జన్మించిన వారు తులారాశికి చెందుతారు.

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో తులారాశి వారికి

ఆదాయం 02, వ్యయం - 08,

రాజ పూజ్యం - 01, అవమానం - 05

* గురువు :- ఉగాది ప్రారంభం నుండి సెప్టెంబర్ 14 వరకు పంచమ స్థానమైన ( కుంభం) లో లోహమూర్తిగా ఉంటాడు .. తర్వాత నవంబర్ 20 వరకు చతుర్ధములో రజిత మూర్తిగా ఉండి .. తదనంతరం సంవత్సరమంతా ఐదో ఇంట్లో లోహమూర్తిగా ఉంటాడు.

* శని :- సంవత్సరమంతా ... చతుర్ధ స్థానమైన ( మకరరాశి )లో లోహమూర్తిగా ఉంటాడు.

* రాహు కేతువులు :- సంవత్సరమంతా 8, 2 ( వృషభ, వృశ్చిక ) రాశులలో రజిత మూర్తులుగా ఉంటారు.

ఈ ఉగాది నుండి గురువు వలన మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి.

నవంబర్ 19 వరకు శత్రులపై విజయాలను సాధిస్తారు .

స్వంత ఇంటి కల ఈ సంవత్సరం సాకారం అవుతుంది .

భూమికి సంబంధించిన, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇది అనుకూలమైన కాలం.

మాత్రు వర్గీయుల నుండి ఆర్థిక పరమైన లాభములను పొందుదురు.

గత కొంత కాలంగా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల నుంచి ఊరట లభింస్తుంది.

నవంబర్ 20 నుండి గురువు ( అశుభుడు ) అనుకూలమైన ఫలితాలను ఇవ్వడు.

How will this Ugadi year be for the people who hold Libra as Zodiac sign

తరచూ అనవసరమైన తగాదాలు,

ఆరోగ్య సమస్యలు, వృధా ధన వ్యయం, అనుకోని ఖర్చులు.

షేర్ మార్కెట్ లేదా వ్యాపారాలలో పెట్టుబడులకు సంబంధించి నష్టాలను సూచిస్తున్నాయి.

* తులారాశి వారికి అర్దాష్టమ శని ప్రభావం నడుస్తున్నది.

అశుభ ఫలితాలే ఎక్కువగా ఉంటాయి.

శని ప్రభావం ఉన్నప్పటికిని.. ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభింస్తుంది.

రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వారుకి శని లాభాలను కలిగిస్తాడు.

మొత్తం మీద ఈ సంవత్సరం .. శని తులారాశి వారికి చక్కటి అభివృద్ధి కరమైన ఫలితాలు ఇస్తాడు.

రాహువు - కేతువుల వలన ఆర్థిక పరమైన లాభాలను ఇచ్చినా .. మిగిలిన విషయాలలో శుభ ఫలితాలను ఇవ్వలేడు.

ముఖ్యంగా చెప్పాలంటే వ్యక్తి గత జీవితంలో తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కోవలసి వస్తుంది,

సెల్ఫ్ డ్రైవింగ్ చేయకపోవడం ఉత్తమం, వాహనాలతో మరియు ప్రయాణాలలో ఎక్కువ జాగ్రత్తగా ఉండవలెను.

జీవిత భాగస్వామికి సంబంధించిన అసంతృప్తి కలుగుతుంది,

సంతానం లేని వారికి వారు చేయు .. సంతాన ప్రయత్నాలు విఫలం మగును.

ఎదిగిన సంతానం విషయంలో వారి వ్యవహార శైలి వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

* ఈ ప్లవ నామ సంవత్సరంలో రాహు - కేతువులు ( అశుభులు ) కాబట్టి శుభ ఫలితాలను ఇవ్వరు.

* ( ఇతర అన్ని గ్రహ స్థానాల ఆధారంగా ఫలితాలు ఇలా ఉండనున్నాయి. )

గ్రహ గోచార తరుణోపాయాల వలన సంతానం లేనివారికి సంతాన యోగం కలుగుతుంది.

అన్ని ఉన్ననూ.. ఎదో లోటుగా మిమ్మల్ని భాదిస్తుంది.

చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది.

ఒకప్పుడు మిమ్మల్ని అత్యంత గౌరవించిన వారే బద్దశత్రువులు అవుతారు.

సమాజంలో గౌరవం, మర్యాదలు తగ్గుతాయి,

అన్నదమ్ములతో మరియు ఆత్మీయులతో విరోదాలు ఏర్పడుతాయి,

మితిమీరిన విశ్వాసం వలన అపకీర్తి, ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బందులను ఎదుర్కుంటారు.

ఇలాంటి ఎన్నో సమస్యలను ఎదుర్కోంటున్న కాలంలోనే ..మీకు అనుకున్న ఉద్యోగం లభించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది.

గతాన్ని పక్కనబెట్టి నూతన జీవితాన్ని ఉత్సాహంగా ప్రారంభిస్తారు.

కొన్ని విషయాలలో ఎవరో చేసిన పనికి మీరు భాదపడవలసి వస్తుంది.

ఈతలకు ( స్విమ్మింగ్ ) దూరంగా ఉండాలి, జల గండ సూచనలున్నాయి.

ఇక మీదట ఇతరులపై పెత్తనం, అజమాయిషీ చేయకూడదని నిర్ణయించుకుంటారు.

వ్యవసాయ దారులకు పంటలు అనుకూలంగా లాభాన్ని ఇస్తాయి.

ఉద్యోగస్తులకు సెప్టెంబర్ నవంబర్ మధ్య కాలంలోఅనుకోని తగాదాలు, కొత్త చిక్కులు ఏర్పడుతాయి.

అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు.

రాజకీయ నాయకులకు ఈ కాలం కొంత ఇబ్బంది కరమైనదే.. గౌరవ ప్రతిష్టతకు ఇబ్బందులు ఏర్పడతాయి.

విద్యార్ధులు ఎక్కువ కష్టపడాలి.

వ్యాపారస్తులకు అంతగా కలిసిరాదు. జాగ్రత్తలు తీసుకోవాలి.

అనుకూలమైన శుభ ఫలితాలు పొందుటకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, కుక్కలకు, పిల్లులకు వాటికి నచ్చిన ఆహార పదార్ధాలను ఇస్తూ ఉండండి.

సర్వేజనా: సుఖినోభవంతు ఓం శాంతి శాంతి శాంతి: .. జై శ్రీమన్నారాయణ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+