Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కన్యారాశి వారికి 2021 - 2022 శ్రీ ప్లవ నామ ఉగాది వార్షిక ఫలితాలు

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య

ఉత్తర 2,3,4 పాదములవారు, హస్త 1,2,3,4 పాదముల వారు, చిత్త 1,2 పాదములలో జన్మించిన వారు కన్యారాశికి చెందుతారు.

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి

ఆదాయం 05, వ్యయం - 05,

రాజ పూజ్యం - 05, అవమానం - 02.

* గురువు :- ఉగాది ప్రారంభం నుండి సెప్టెంబర్ 14 వరకు షష్టమ స్థానమైన ( కుంభం) లో రజిత మూర్తిగా .. నవంబర్ 20 వరకు పంచమంలో తామ్ర మూర్తిగా ఆ తర్వాత సంవత్సరమంతా షష్టమంలో రజిత మూర్తిగా ఉంటాడు.

* శని :- సంవత్సరమంతా ... పంచమ స్థానమైన ( మకరరాశి )లో రజిత మూర్తిగా ఉంటాడు.

* రాహు కేతువులు :- సంవత్సరమంతా 10, 3 ( వృషభ, వృశ్చిక ) రాశులలో తామ్ర మూర్తులుగా ఉంటారు.

* గురువు ఉగాది నుండి ( అశుభుడు ) ఈ సంవత్సరమంతా ఎలాంటి శుభ ఫలితాలన ఇవ్వడు .

తరచుగా అనేక ఇబ్బందులు, ఆటంకాలు, అపవాదులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

వారసత్వ సంబంధ, లేదా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో నష్టపోవు సూచనలు అధికంగా ఉన్నవి.

ఎవరి వ్యక్తిగత జాతకంలో కనుక 'గురుబలం' లోపించినచో .. కన్యారాశి వారు శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ప్రతీ విషయంలో ఆలోచించుకొని వ్యవహరించాల్సి వస్తుంది.

How will this Ugadi year be for the people who hold Virgo as Zodiac sign

ప్రేమ వ్యవహారాలకు , ఆకర్షణలకు ఎంత దూరం ఉంటే అంతా మంచిది.

వ్యక్తిగత జీవితంలో ముఖ్య నిర్ణయాలలో చాలా జాగ్రత్తలు వహించాలి.

* శని శుభ దృష్టి వలన సంవత్సరమంతా ఆర్ధికంగా అనుకూలమైన శుభ ఫలితాలను ఇస్తాడు.

సంతాన ప్రయత్నాలు చేయు వారికి పుత్రికా సంతానం లభించును.

పుత్ర సంతానానికి ఆరోగ్య సమస్యలు ఏర్పడే సూచనలున్నాయి .

లోహ సంబంధమైన వ్యాపారాలు చేసే వారికి విశేషమైన లాభాలు పొందుతారు.

* రాహువు- కేతువులు ఇందరూ ఈ సంవత్సరమంతా శుభ ఫలితాలను ఇస్తారు.

భూమికి సంబంధించిన వ్యాపారాలు ( రియల్ ఎస్టేట్ ) రంగం వారికి ఈ సంవత్సరం విశేమైన ధన లాభాలు కలుగ చేయును.

పితృ వర్గం వారికి సంవత్సర మధ్యలో తీవ్ర ఆరోగ్య భంగములు కలుగ చేయును.

* ( ఇతర అన్ని గ్రహ స్థానాలను ఆధారంగా ఫలితాలు ఇలా ఉండనున్నాయి. )

* కుటుంబంలో శుభాకార్యాలు జరుగుతాయి.

ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి.

గృహయోగం, గృహనిర్మాణం చేసే అవకాశం ఉన్నది.

తమకు ఉన్నంతలోనే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.

పేరుప్రతిష్టలు నిలబెట్టుకోవడానికి విశేషమైన కృషి చేస్తారు.

విదేశాలకు సంబధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి.

విదేశాలకు సంబంధించిన వ్యవహారంలో - వీసా, గ్రీన్ కార్డు మొదలైనవి లభిస్తాయి .

రాజకీయ రంగం వారికి మాత్రం గడ్డు కాలమనే చెప్పాలి ... జాగ్రత్తలు తీసుకోవడం అవసరం లేదంటే ఇబ్బందులు తప్పవు.

అవివాహితులకు వివాహయోగం,

సంతానం కోసం ఎదిరి చూస్తున్న వారికి సంతాన యోగం కలుగుతుంది.

కొన్ని ముఖ్యమైన విషయాలలో జీవిత భాగస్వామితో వివాదాలు ఏర్పడే అవకాశం ఉన్నది జాగ్రత్త వహించండి.

వ్యవసాయ దారులకు మొదటి పంట సామాన్యం, మిగితా పంటలు అనుకూలమైన లాభాలను ఇస్తాయి.

వ్యాపారస్తులకు సెప్టెంబర్ నుండి అక్టోబర్ మధ్య కాలంలో మంచి లాభాలు ఉంటాయి. మిగితా కాలమంత సామాన్యం.

విద్యార్ధులు చాలా కష్ట పడితే తప్ప మంచి ఫలితాలను పొందలేదు.

అనుకూలమైన శుభ ఫలితాలు పొందుటకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుని ఆరాధన చేయండి.

సర్వేజనా: సుఖినోభవంతు ఓం శాంతి శాంతి శాంతి: .. జై శ్రీమన్నారాయణ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+