ఈ సంకేతాలు కనిపిస్తే ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్లు లెక్క

వాస్తు శాస్త్రం గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు మన జీవితంతో అది ముడిపడి ఉంటుంది. వాస్తు లేకుండా ఏ నిర్మాణం జరగదు. ఇంట్లోవాస్తు దోషం ఉంటే కొన్ని సంకేతాలు కనపడతాయి. వాటిని గుర్తించాలని నిపుణులు చెబుతున్నారు. వాటిని గుర్తించి సరిచేసుకోవడవల్ల కొన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా సుసంపన్నమైన, సంతోషకరమైన జీవితాన్ని పొందొచ్చు. మనిషి జీవితానికి, ఆనందానికి ప్రతీక ఇల్లు. కాబట్టి ఆ ఇంటికి ఎటువంటి వాస్తు దోషం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఇంటి యజమానిపై ఉంటుంది.

ఇంటికి వాస్తు దోషం ఉన్నప్పుడు కనిపించే ప్రధాన సంకేతాల గురించి తెలుసుకుందాం.

నిద్ర లేకపోవడం, మానసిక అలసటగా ఉండటం
పడకగది దిశ లేదా మంచం స్థానం సరిగ్గా లేకపోతే నిద్ర సమస్యలు, మానసిక ఒత్తిడి కలుగుతాయి.

If these signs are seen it is considered that there is a Vastu defect in the house

ఇంట్లో విచారంగా వాతావరణం ఉండటం
ఇంట్లో ఎప్పుడూ నెగటివ్ ఎనర్జీ లేదా వాతావరణం విచారకరంగా అనిపిస్తే అది వాస్తు దోషం కారణంగా అవుతుంది.

తిరిగివచ్చే సమస్యలు
జీవితంలో ఒకే రకమైన ఇబ్బందులు మళ్లీ మళ్లీ రావడం వాస్తు లోపం కారణంగానేనని భావిస్తారు.

కుటుంబంలో నిరంతర తగాదాలు, మానసిక ఒత్తిడి
ఇంట్లో తరచుగా చిన్న చిన్న విభేదాలు, వాగ్వాదాలు జరగడం వాస్తు లోపానికి సంకేతంగా భావిస్తారు.

తరచుగా ఆరోగ్య సమస్యలు తలెత్తడం
కుటుంబ సభ్యులు తరచుగా అస్వస్థతతో బాధపడటం, నిద్రలేమి లేదా అలసట అనుభవించడం వాస్తు లోపాన్ని సూచిస్తుంది.

డబ్బు సంబంధిత సమస్యలు ఎదురుకావడం
నిరంతరం ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడం, లాభాలు రాకపోవడం వంటి పరిస్థితులు వాస్తు దోషం కారణంగా వస్తాయని నమ్ముతారు.

ఇంటికి పగుళ్లు లేదా వస్తువులు నాశనం కావడం
గోడలు పగలడం, ఎలక్ట్రానిక్ పరికరాలు తరచుగా చెడిపోవడం వంటి సంఘటనలు ఇంటిలో ప్రతికూల శక్తి ఉందని సూచిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+