అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేకుంటే ఇవి తెచ్చుకోండి చాలు.. మీకు లక్ష్మీకటాక్షం

మే 10వ తేదీన అక్షయ తృతీయ జరుపుకోవడానికి హిందువులంతా సిద్ధమవుతున్నారు. హిందూ సాంప్రదాయంలో అతి ముఖ్యమైన పండుగలలో అక్షయ తృతీయ కూడా ఒకటిగా చెప్పబడింది. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్లపక్ష తృతీయ తిథి నాడు అక్షయ తృతీయను జరుపుకుంటారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేస్తే మేలు జరుగుతుందని లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని చాలామంది భావిస్తూ ఉంటారు.

అక్షయ తృతీయ నాడు బంగారం కొనలేకుంటే బాధ పడొద్దు
అయితే ప్రస్తుతం విపరీతంగా పెరిగిన బంగారం ధరలతో అక్షయ తృతీయ పండుగ నాడు బంగారాన్ని కొనుగోలు చేయడానికి సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదు. బంగారం కొనుగోలు చేసేంత డబ్బు లేని వారు అక్షయ తృతీయనాడు బంగారం కొనుగోలు చేయలేదని బాధపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు.

If you can t buy gold on Akshaya Tritiya just get these things for Lakshmi blessings

అక్షయ తృతీయ నాడుకొన్ని వస్తువులు తెచ్చుకుంటే మంచి ఫలితం
భారతీయ పండుగలలో ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్న అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొనుగోలు చేయలేని వారు కొన్ని వస్తువులను కొనుగోలు చేసుకుంటే, వాటిని ఇంటికి తెచ్చుకుంటే శుభం కలుగుతుందని, బంగారం కొనుగోలు చేస్తే ఎటువంటి ఫలితం అయితే వస్తుందో, అటువంటి ఫలితమే ఈ వస్తువులను కొనుగోలు చేస్తే కూడా వస్తుందని చెబుతున్నారు.

అక్షయ తృతీయ నాడు వీటిని తెచ్చి పెట్టుకోండి
అక్షయతృతీయ రోజు బంగారాన్ని కొనుగోలు చెయ్యలేనివారు దక్షిణావర్తి శంఖాన్ని ఇంటికి తీసుకువచ్చి ఆ శంఖాన్ని దైవంగా పూజగదిలో పెట్టి పూజ చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి కొలువుంటుంది అని చెబుతారు. అంతేకాదు అక్షయ తృతీయ పండుగనాడు శివలింగాన్ని ఇంటికి తెచ్చుకోవడం వల్ల కూడా మేలు జరుగుతుందని, ముఖ్యంగా పాదరస శివలింగాన్ని ఇంటికి తెచ్చుకొని నియమనిష్టలతో పూజించడం వల్ల బంగారాన్ని కొనుగోలు చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో, అంతటి ఫలితం వస్తుందని చెబుతున్నారు.

వీటితో ఊహించని గొప్ప ఫలితాలు
అంతేకాదు అక్షయ తృతీయ పండుగ నాడు ఏకాక్షి కొబ్బరికాయను తీసుకువచ్చి, లక్ష్మీదేవి రూపంగా భావించి పూజ చేస్తే లక్ష్మీదేవి కటాక్షం మెండుగా ఉంటుందని చెబుతున్నారు. ఆ ఇంట్లో సిరిసంపదలు ఉంటాయని చెబుతున్నారు. ఇక అక్షయ తృతీయ పండుగ నాడు బంగారాన్ని కొనుగోలు చేయలేని వారు కొత్త కుండను కొనుగోలు చేసి తెచ్చుకుంటే మంచిదని, ఇంటికి శ్రీ యంత్రాన్ని తెచ్చుకుంటే మంచిదని వీటివల్ల మనం ఊహించని గొప్ప ఫలితాలు వస్తాయని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+