ఈ కలలు మిమ్మల్ని కోటీశ్వరులను చేసే సంకేతాలు!
చాలామంది నిద్రించే సమయంలో కలలు కంటూ ఉంటారు. అయితే కలల శాస్త్రం ప్రకారం కొన్ని కలలు మన జీవితంలో భవిష్యత్తులో జరగబోయే విషయాలను, శుభాలను తెలియజేస్తే, మరికొన్ని మన జీవితంలో ముందు ముందు జరగబోయే అశుభాలను తెలియజేస్తాయి. ఇక స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను చూడడం అదృష్టంగా చెబుతారు. ఏమి కలలో వస్తే అదృష్టం కలుగుతుంది? మనల్ని కోటీశ్వరులను చేసే కలలు ఏమిటి? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
కలలో ఇవి కనిపిస్తున్నాయా
డ్రీమ్ సైన్స్ ప్రకారం నిద్రిస్తున్నప్పుడు కలలో కనిపించే కొన్ని సూచనలు భవిష్యత్తు సంఘటనలను మనకు అర్థమయ్యేలా చెబుతాయి. స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని కలలు చాలా శుభకరమైనవిగా చెప్పొచ్చు. కొన్ని కలలు మనకు ఆర్థిక లాభాలను కలిగిస్తాయి. కలలో డబ్బు లేదా బంగారాన్ని చూసినట్టుగా వస్తే ఇది శుభ పరిణామంగా పరిగణించబడుతుంది.

సంపన్న యోగం పట్టించే కలలు
దీంతో భవిష్యత్తులో మీరు డబ్బు పొందవచ్చని అర్థం. ఈ కల వస్తే మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని, మీకు సంపన్నయోగం పట్టబోతుందని చెప్పొచ్చు. స్వప్న శాస్త్రం ప్రకారం నదులను కలలో చూడడం కూడా శుభప్రదంగా భావించబడుతుంది. నదులు కలలో కనిపిస్తే దీని అర్థం లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుంది అన్న సంకేతం అని చెప్తారు. ఈ కల వస్తే మీరు ఆర్థిక ఇబ్బందుల నుంచి త్వరలోనే బయటపడతారని సంకేతం.
ఈ కలలతో లక్ష్మీదేవి ఆశీర్వాదం
కలలో ఆలయాన్ని చూసినట్టు వస్తే అది కూడా శుభప్రదంగా చెప్పొచ్చు. కలలో ఆలయ సందర్శనం లక్ష్మీదేవి ఆశీర్వాదాలు తెస్తుందని, భవిష్యత్తులో కొన్ని శుభవార్తలను తీసుకువస్తుందని చెబుతారు. శుభ సూచకమని చెబుతున్నారు. స్వప్న శాస్త్రం ప్రకారం కుటుంబ జీవితంలో ఆనందం, శ్రేయస్సు, శాంతి కలలో తామర పువ్వు కనిపిస్తే కలుగుతాయని చెబుతున్నారు.
కోటీశ్వరులను చేసే కలలు
అంతేకాదు కలలో దీప దర్శనం కూడా శుభసూచకం. ఎవరికైతే కలలో వెలుగుతున్న దీపం కనిపిస్తుందో అది వారికి లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదాలు ఇస్తుంది. మొత్తంగా కలలో కనిపించే ఈ ఐదు వస్తువులు మీకు డబ్బులు తెస్తాయని, కోటీశ్వరులను చేస్తాయని స్వప్న శాస్త్రం చెప్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications