రోడ్డుపై వెళ్ళేటప్పుడు ఇవి చూస్తే మీరు నక్కతోక తొక్కినట్టే!
మన జీవితంలో కనిపించే ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మనకు కనిపించే వస్తువులు కొన్ని శుభ ఫలితాలను ఇస్తే, మరికొన్ని అశుభ ఫలితాలను ఇస్తాయి. అయితే రోడ్డుపై కనిపించే ఏ వస్తువులతో మనకు శుభాలు జరుగుతాయి? ఏ వస్తువులు అస్సలు మంచిది కాదు? అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అయితే ప్రస్తుతం మనం రోడ్డుపై కనిపించే ఏ వస్తువులతో మంచి రోజులు వస్తాయో తెలుసుకుందాం.
రోడ్డుపై డబ్బు కనిపిస్తే
తరచుగా మన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు డబ్బులు గానీ, కొన్ని రకాల వస్తువులు గాని మన కళ్ళకు కనబడతాయి. అయితే కొన్నిసార్లు రోడ్డు మీద కనిపించే వస్తువులు కచ్చితంగా మీకు అదృష్ట సంకేతాన్ని ఇస్తాయి. శకున శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు మనకి అదృష్టాన్ని ఇస్తాయి. బయటకు వెళుతున్నప్పుడు ఎక్కడైనా మనకు రోడ్డు మీద డబ్బు కనిపిస్తే అది మనకు శుభసంకేతం అని చెప్పవచ్చు.

రోడ్డుపై ఇవి కనిపిస్తే లక్ష్మీదేవి కటాక్షం
త్వరలో మనకు ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుందని అర్థం. అయితే రోడ్డు మీద కనిపించిన డబ్బులు తీసుకుని జేబులో పెట్టుకోవడం మంచిది కాదు. ఒకవేళ దానిని తీసుకుంటే అవసరంలో ఉన్న ఎవరికైనా దానం చేయడం ఉత్తమం. ఇక శకున శాస్త్రం ప్రకారం నెమలీకలు అదృష్టానికి, లక్ష్మీదేవి ఆశీర్వాదానికి ప్రతీకగా చెబుతారు. నేను మీకు బయట ఎక్కడైనా నెమలీకలు కనిపిస్తే అది మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి అన్న శుభసంకల్పం కారణం.
ఇవి కనిపిస్తున్నాయా? అయిది మీదే లక్
నెమలీకల కారణంగా త్వరలో మీరు శుభవార్తలు వింటారు. బయటకు వెళ్ళినప్పుడు ఎవరికైనా పసుపు రంగు పువ్వులు కనబడితే శుభప్రదంగా చెబుతారు. ఇది లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. ఎవరికైనా పసుపు రంగు పువ్వులు కనిపిస్తే త్వరలో సంపద శ్రేయస్సు వస్తుందని చెబుతారు. కొందరికి బయటకు వెళ్ళినప్పుడు ధాన్యం కనిపిస్తుంది. ఇది కూడా మీకు ఆహారానికి ఎటువంటి లోటు ఉండదని సూచించే సంకేతం.
జీవితంలో సంతోషం కలిగించే సంకేతాలు ఇవి
రోడ్డు పైన పడి ఉన్న తాజా పువ్వులు లేదా పండ్లను చూసినట్లయితే ఇది కూడా అదృష్టానికి చిహ్నంగా చెబుతారు. మీ జీవితంలో కొత్త సంతోషాలు మంచి అవకాశాలు రాబోతున్నాయని ఇది సూచిస్తుంది. ఏది ఏమైనా ఇవి మీకు బయటకు వెళ్ళినప్పుడు కనిపిస్తే మీ అదృష్టం మామూలుగా ఉండదు.












Click it and Unblock the Notifications