ఈ దిశలో తలపెట్టి పడుకుంటే మరణ భయం.. జాగ్రత్త!
జ్యోతిష్య శాస్త్రం మాత్రమే కాదు మానవ జీవితంపై వాస్తు శాస్త్రం కూడా ప్రభావం చూపిస్తుంది. వాస్తులో నిద్రించేందుకు కూడా కొన్ని ప్రత్యేకమైన దిశలు ఉన్నాయి. నిద్రించే దిశలు మన జీవితం పైన ప్రభావం చూపిస్తాయి. వాస్తు శాస్త్రంలో నిద్రించే దిశలు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం నిద్రించే దిశ మన జీవితంలో శుభ, అశుభ సంకేతాలకు హేతువు అవుతుంది.
నిద్రించే దిశలతోనే ఫలితాలు
నిద్రించే దిశ విషయంలో జాగ్రత్త లేకుంటే మనం చాలా ప్రతికూల ఫలితాలను చూడాల్సి వస్తుంది. కాబట్టి మనం ఏ దిశలో తల పెట్టి పడుకోవాలి? ఎలా పడుకోవాలి? అనేది తెలుసుకోవాలి . తదనుగుణంగా మంచి దిశలోనే నిద్రించాల్సిన అవసరం ఉంది. ప్రతి రోజు ఇంట్లో మనం నిద్రించే దిశ రక రకాల ఫలితాలను కలిగిస్తూ ఉంటుంది.

ఈ దిశలో తలపెట్టి నిద్రిస్తే మంచిది
సహజంగా నిద్రించేటప్పుడు మనం నైరుతి వైపు తల పెట్టి, ఉత్తరం వైపు కాళ్ళు పెట్టి నిద్రించాలి అని చెబుతారు. అయితే నైరుతి వైపు మాత్రమే కాకుండా, కొన్ని శుభ ఫలితాలను కలిగించే దిశలు కూడా ఉన్నాయి. ఆ దిశలో తల పెట్టి నిద్రిస్తే మంచిదని చెబుతున్నారు. తూర్పు దిశలో తల పెట్టి నిద్రిస్తే ఆ వ్యక్తి జీవితంలో సుఖం, సంతోషం కలుగుతాయి.
ఈ దిశల్లో తల పెట్టి నిద్రిస్తే జరిగేదిదే
పడమర దిశకు తల పెట్టి నిద్ర పోతే చిరాకు, ఆందోళనలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు . దక్షిణ దిశలో తలపెట్టి నిద్రపోతే కీర్తి ,విద్య, శాంతి కలుగుతాయి. ఈ దిశ కూడా నిద్రకు ఎంతో మంచిదని చెబుతున్నారు.నైరుతి వైపు తల పెట్టి నిద్ర పోతే జీవితంలో అభివృద్ధి చెందుతారని చెబుతున్నారు. . ఇక ఈశాన్యం వైపు తల ఉంచి నిద్రపోతే కలహాలు, రుణాలు వంటి సమస్యలతో ఇబ్బంది పడతారని చెబుతున్నారు.
ఈ దిశలో తలపెట్టి పడుకుంటే మరణ భయం
ఆగ్నేయం వైపు తల ఉంచి నిద్రపోతే రుణబాధలు కలుగుతాయని చెబుతున్నారు. వాయువ్యం వైపు తల ఉంచి నిద్రపోతే అనేక పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయని అది ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు. ఉత్తరదిశలో తలపెట్టి నిద్రిస్తే చాలా ప్రమాదం జరుగుతుందని, అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంటుందని, మరణం కూడా సంభవించవచ్చునని చెబుతున్నారు. అందుకే మనకు శుభఫలితాలను కలిగించే దిశలలో తలపెట్టి నిద్ర పోవడం మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications