నాలుగు రోజులు ఆగితే మీరే కోటీశ్వరులు!
గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ఉంటాయి. ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రానికి కూడా సంచారం చేస్తాయి. అలా గ్రహాలు సంచారం చేసే సమయంలో వేరొక గ్రహంతో కలిసి కొన్ని శుభ యోగాలను, కొన్ని అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. శుక్రుడు సంపదలకు, విలాసాలకు, ప్రేమకు అధిపతి. శుక్రుడు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తాడు.
చిత్తా నక్షత్రంలో శుక్ర సంచారం.. అదృష్ట రాశులు
ఇప్పుడు ప్రస్తుతం శుక్రుడు నక్షత్ర సంచారం చేయబోతున్నాడు. అక్టోబర్ 28వ తేదీ చిత్త నక్షత్రంలోకి సంచరించబోతున్నాడు. చిత్త నక్షత్రానికి కుజుడు అధిపతి అటువంటి చిత్త నక్షత్రంలో శుక్ర సంచారం అక్టోబర్ 28 మంగళవారం నాడు ఉదయం 5గంటల 15 నిమిషాలకు జరుగుతుంది. చిత్తా నక్షత్రంలోకి శుక్రుడు సంచరించడంతో కొన్ని రాశుల వారు లబ్ధిని పొందుతారు. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

మేషరాశి
చిత్తా నక్షత్రంలో శుక్ర సంచారం మేష రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది .ఈ సమయంలో మేషరాశి వారికి ఉద్యోగులకు, వ్యాపారులకు ఎక్కువ లాభాలు ఉంటాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామిని అర్థం చేసుకునే వారికి ఇల్లు స్వర్గధామంగా మారుతుంది. ఆర్ట్, మ్యూజిక్ రంగాలవారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది.
వృషభ రాశి
చిత్తా నక్షత్రంలో శుక్ర సంచారం వృషభ రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వృషభ రాశి వారు సంతోషంగా జీవిస్తారు. వీరి ప్రేమ జీవితం బాగుంటుంది. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేసుకుంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సమస్యల పరిష్కారమై ఇంట్లో ప్రశాంతత వస్తుంది.
తులారాశి
చిత్తా నక్షత్రంలో శుక్ర సంచారం తులా రాశి జాతకులకు బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. తులా రాశి జాతకులు ఏ పని చేసిన విజయాలు వరిస్తాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒంటరిగా ఉన్న వారు ప్రేమ జీవితంలో మార్పు పొందే అవకాశం ఉంది. భూములను ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా ఈ సమయం బాగుంటుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి చిత్తా నక్షత్రంలో శుక్ర సంచారం లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి కలిసి వస్తుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఎప్పటినుంచో వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగం చేసే వారు ఉన్నతాధికారుల మద్దతును పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తారు.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications