ఆగస్టు 28 వరకూ ఈ రాశులవారికి అఖండ ధనయోగం.. ఆశీర్వదించిన గ్రహాలు!
జూలై మాసంలో సంచారం చేస్తున్న వివిధ గ్రహాలు కొన్ని రాశుల వారికి అనుకూలతలను కలిగిస్తున్నాయి. ప్రధాన శుభగ్రహాల అనుకూల సంచారం కారణంగా ఆగస్టు 28వ తేదీ వరకు కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. ఐదు ప్రధాన గ్రహాలు ఆశీర్వదిస్తున్న, అఖండ ధన ప్రాప్తిని కలుగజేస్తున్న ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
వృషభ రాశి
ఐదు ప్రధాన గ్రహాల సంచారం వృషభ రాశి జాతకులకు కలిసి వస్తుంది. వృషభ రాశి వారికి బుధ, గురు, శుక్ర లతోపాటు శని, కుజ, రాహు గ్రహాలు బాగా అనుకూలంగా ఉండడం కారణంగా ఈ సమయంలో వీరి జీవితం సంతోషంగా ఉంటుంది. ఊహించని విధంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పెట్టుబడులు పెట్టిన వారికి కలిసి వస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలు చేసేవారు శుభవార్తలు వింటారు.

సింహరాశి
సింహరాశి వారికి ఐదు ప్రధాన గ్రహాల సంచారం ఆగస్టు 28 వరకు శుభ ఫలితాలను ఇస్తుంది. శుక్రుడు గురుడు , కుజుడు, కేతువు, రవి బాగా అనుకూలంగా ఉన్న కారణంగా సింహరాశి వారికి అష్టమ శని దోష ప్రభావం తగ్గుతుంది. ఏ పని చేసినా బాగా కలిసివస్తుంది. ఉద్యోగం చేసేవారికి పదోన్నతులు, ఇంక్రిమెంట్లు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసేవారికి అనుకున్న పనులు పూర్తవుతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక తీరుతుంది.
తులారాశి
తులా రాశి వారికి శుక్రుడు, గురువు, బుధుడు, కుజుడు, రవి ,శని బాగా అనుకూలంగా ఉండటం వల్ల వీరికి కలిసి వస్తుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారు లాభాలను చూస్తారు. ఈ సమయంలో ఏ పని చేసినా మెరుగైన ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే భిన్నంగా మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు, వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి గురువు, రవి, కేతువు, కుజుడు, రాహువు బాగా అనుకూలంగా ఉండటం వల్ల అర్ధాష్టమ శని ప్రభావం తగ్గి కాస్త సానుకూల ఫలితాలు వస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు వస్తాయి. కుటుంబ జీవితం సంతోషదాయకం గా ఉంటుంది.
మకర రాశి
శని, శుక్రుడు, బుధుడు, రవి, రాహువులు అనుకూలంగా ఉండడంవల్ల మకర రాశి వారికి కలిసి వస్తుంది. ఉద్యోగం చేసే వారిని పురోగతి కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాలు చేసే వారి వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు వస్తాయి. వివిధ మార్గాల నుంచి ఆదాయం సంపాదించడానికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. సొంతింటి కల నెరవేరుతుంది.
కుంభరాశి
గురువు, శుక్రుడు, రవి, కుజుడు, రాహువు అనుకూలంగా ఉన్న కారణంగా కుంభ రాశి వారికి కలిసి వస్తుంది. వీరికి శని ప్రభావం నుంచి విముక్తి లభిస్తుంది. వివిధ మార్గాలలో ధనార్జనకు అవకాశం ఉంది. నూతన గృహాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖసంతోషాలు వృద్ధి చెందుతాయి. శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications