2025లో ఈ రాశులవారి రాజసానికి తిరుగే లేదన్న రాహు కేతువులు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో నీడ గ్రహాలైన రాహు కేతువులకు ఒక స్థానం ఉంది. చెడు చేసే గ్రహాలు, కీడు గ్రహాలుగా భావించే రాహు కేతువులు నిదానంగా వివిధ రాశుల్లోకి తిరోగమన దిశలో ప్రయాణం చేస్తూ ఉంటాయి. 2025 మే నెలలో రాహు కేతువులు తమ స్థానాలను మార్చుకుంటున్నారు.
2025 సంవత్సరంలో రాహు, కేతు సంచారం
రాహువు కుంభ రాశిలోకి, కేతువు సింహ రాశిలోకి సంచారం చేస్తుంది. ఇది కొన్ని రాశుల వారికి సానుకూల శక్తిని, వృద్ధిని తీసుకువస్తుంది. మరికొన్ని రాశుల వారు కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. రాహు కేతువుల సంచారం కారణంగా లబ్ధి 2025 సంవత్సరంలో పొందే రాశుల వారు ఎవరు అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేషరాశి
2025 సంవత్సరంలో మేషరాశి జాతకులు రాహు కేతువుల సంచారం కారణంగా ఆర్థిక లాభాలను పొందుతున్నారు. రాహువు శుభ స్థానంలో ఉండడం మేష రాశి వారికి ఊహించని ఆదాయాన్ని తెస్తుంది. మేష రాశి వారికి ఈ సమయంలో బాగుంటుంది. వృత్తిపరమైన విషయాలలోనూ మేషరాశి జాతకులు విజయాలను సాధిస్తారు. ఇది మేష రాశి వారికి అనుకూల సంవత్సరం.
మిధున రాశి
మిధున రాశి వారికి రాహు కేతువుల సంచారం కారణంగా ప్రయోజనం కలుగుతుంది. రాహువు యొక్క ప్రభావం వల్ల వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధ్యమవుతుంది. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. సంపద సృష్టికి కొత్త అవకాశాలు కనిపిస్తాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులు రాహు కేతువుల సంచారం కారణంగా వ్యక్తిగత మరియు వృత్తిపరమైన అభివృద్ధిని చూస్తారు. ఆర్థిక స్థిరత్వం పొందడానికి ఇది అనుకూలమైన సమయం. ఈ సమయంలో కుటుంబ జీవితం కూడా సామరస్యంగా సాగుతుంది. ఉద్యోగంలో మార్పులు వస్తాయి. ప్రమోషన్లు కోరుకునేవారు ఈ సమయంలో విజయాలను సాధిస్తారు.
మకర రాశి
మకర రాశి వారికి 2025లో ఆర్థిక స్థిరత్వం వస్తుంది. పెట్టుబడులు పెట్టడానికి మకర రాశి వారికి ఇది అనుకూలమైన సమయం. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. ఆస్తిలో లాభాలు బలంగా కనిపిస్తాయి. వృత్తిపరమైన వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. మకర రాశి వారికి ఈ సమయంలో సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి.
మీనరాశి
రాహు కేతువుల సంచారం కారణంగా మీనరాశిలో సానుకూలతలు చోటుచేసుకుంటాయి. ఈ సమయం మీన రాశి వారికి శ్రేయస్సును కలిగిస్తుంది. కెరీర్లో పురోగతితో పాటు ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుంది. మీనరాశి జాతకులు ఈ సమయంలో సంతోషంతో జీవిస్తారు. వ్యక్తిగత సంబంధాలు వృద్ధి చెంది 2025 వీరికి సంతృప్తికర సంవత్సరంగా మారుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications