2025లో ఈ రాశులపై ఏలినాటి శని ప్రభావం.. కష్టాల దండయాత్ర!
2024 సంవత్సరం శని సంవత్సరమని ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ సంవత్సరం శని కుంభరాశిలో ఉంటున్నాడు. ఇక వచ్చే సంవత్సరం శని తన రాశిని మార్చుకుంటున్నాడు. 2025లో శని రాశి సంచారం కారణంగా కొన్ని రాశుల మీద శని ప్రభావం పడుతుంది .2025లో ఏ ఏ రాశుల పైన ఏలినాటి శని ప్రభావం ఉంటుంది వంటి వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
2025లో రాశిని మార్చుకునే శని
2025లో శని తన రాశిని మార్చుకుంటుంది. అంతేకాదు తిరోగమన దిశలో సంచారం చేస్తుంది. 2025లో శని మీనరాశిలోకి అడుగుపెట్టబోతున్నాడు. 2025 మార్చి 29వ తేదీన శని కుంభరాశి నుంచి మీన రాశిలోకి వెళ్తాడు. మీన రాశిలో శని దాదాపు రెండున్నర సంవత్సరాలు సంచరిస్తాడు. దీంతో మీన రాశి వారిపైన ఏలినాటి శని ప్రభావం పడుతుంది.

మీనరాశి, మేషరాశి వారికి ఏలినాటి శని
దీని నుండి మీన రాశి వారు బయటపడడానికి చాలా కాలం వేచి ఉండాలి. మీన రాశి వారికి ఏడున్నర సంవత్సరాల కాలం ఏలినాటి శని ఉంటుంది. ఆ తర్వాత వీరికి సడే సతి నుంచి విముక్తి లభిస్తుంది. ఇక శని మీన రాశిలోకి వెళ్లడం వల్ల ఏలినాటి శని ప్రభావం మేషరాశి వారి పైన తప్పకుండా ఉంటుంది .ఈ సమయంలో మేషరాశి జాతకులు అష్ట కష్టాలను పడాల్సి వస్తుంది.
ఏలినాటి శని చాలా కష్ట కాలం
ముఖ్యంగా ఏలినాటి శని మూడు దశల్లో ఉంటుంది. ఈ దశలకు తగట్టు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏలినాటి శని ప్రభావంతో జీవితంలో విపరీతమైన ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల చేతిలో మోసపోతారు. ఆర్థికంగా, మానసికంగా అష్ట కష్టాలను పడాల్సి వస్తుంది. ఏడున్నర సంవత్సరాలు తర్వాత మేష రాశి, మీనరాశి వారికి ఏలినాటి శని నుంచి విముక్తి లభిస్తుంది.
ఏలినాటి శని సమయంలో ఇబ్బందులు ఇలా
హిందూమత ధర్మం ప్రకారం శని దేవుడు న్యాయానికి, కర్మలకు అధిపతి. శని ఎవరి కర్మల ఫలితాలు వారికే చూపించే గ్రహం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏలినాటి శని అంటే అన్ని రకాలైన ఇబ్బందులకు మూలం. ఈ సమయంలో డబ్బు పోగొట్టుకుంటారు. వాహన ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. సన్నిహితులతో వివాదాలు వస్తాయి. కోర్టుల వివాదాలు నడుస్తాయి. ఒక్కసారిగా కష్టాలన్నీ మూకుమ్మడిగా దాడి చేస్తాయి. అయితే ఏలినాటి శని ప్రభావం నుంచి ఉపశమనం పొందేందుకు కూడా కొన్ని పరిహారాలు ఉన్నాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications