2025లో ఈ రాశులవారిని వదల బొమ్మాలీ అంటున్న ఏలినాటి శని.. ఏడున్నరేళ్ళు చుక్కలే!
2025 సంవత్సరంలో గ్రహాల గమనం కారణంగా అనేక రాశుల వారి జీవితాలలో మార్పులు వస్తాయి. ముఖ్యంగా వేద జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహం కారణంగా ద్వాదశ రాశుల వారి జాతకాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. శని తలచుకుంటే బిక్షగాడిని కోటీశ్వరుడిని, కోటీశ్వరుడిని బిక్షగాడిని చేయగలడు.
ఈ రాశులపై ఏలినాటి శని ప్రభావం
నెమ్మదిగా ప్రయాణం చేసే శని 2025 సంవత్సరంలో కుంభరాశి నుంచి మీన రాశిలోకి సంచారం చేస్తున్నాడు. ఇక మీన రాశికి అధిపతి బృహస్పతి. మీనరాశిలో శని సంచారం కారణంగా అనేక రాశుల వారి జీవితాలలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని కొన్ని రాశుల వారిని ఇబ్బందులకు గురి చేయనున్నాయి.

మేషరాశి
ఏలినాటి శని ప్రభావం వల్ల మేషరాశి వారికి ఇబ్బందులు కలుగుతాయి. మొత్తం ఏడున్నర సంవత్సరాలు మేషరాశిలో శని మూడు దశలలో ప్రభావాన్ని చూపిస్తారు. మేషరాశి జాతకులు ఈ సమయంలో ఉద్యోగాలలో సమస్యలను ఎదుర్కొంటారు. కొన్ని పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలతో బాధపడతారు. రెండవ దశలో మేషరాశి వారికి కొంచెం కష్టంగా ఉంటుంది. మానసిక ఆందోళన కలుగుతుంది. ఇక మేషరాశి వారికి ఏలినాటి శని ఏడున్నర సంవత్సరాల పాటు ముప్పతిప్పలను పెట్టనుంది.
మీనరాశి
మీనరాశిలో శని సంచారం కారణంగా ఇటు మీనరాశి జాతకులు కూడా ఏలినాటి శని ప్రభావాన్ని చూడబోతున్నారు. అయితే మీన రాశిలోకి శని ప్రవేశించే సమయానికి మీనరాశిలో ఏలినాటి శని రెండవ దశ ప్రారంభమవుతుంది. ఇక ఈ దశ మీనరాశి జాతకులకు అత్యంత ఇబ్బందికరంగాను, సమస్యాత్మకంగానూ ఉంటుంది. ఏడున్నర సంవత్సరాల తర్వాత మీన రాశి వారికి ఏలినాటి శని ప్రభావం నుంచి విముక్తి లభిస్తుంది.
ఈ రాశుల వారు జాగ్రత్త
అయితే ఏలినాటి శని ప్రభావాన్ని చూస్తున్న మేష, మీన రాశుల వారు మొత్తం మూడు దశలకు తగ్గట్టు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని పరిహారాలను కూడా చేయవలసి ఉంటుంది. శని గ్రహ పరిహారాలు చేస్తే, పేదలకు సహాయం చేస్తే కొంతమేరకు ఏలినాటి శని ప్రభావం నుంచి ఉపశమనం దొరుకుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications