2025లో మాలవ్య, కేంద్ర త్రికోణ రాజయోగాలతో ఈ రాశులపై సంపదల కుంభవృష్టి!

2025 నూతన సంవత్సరం త్వరలో రాబోతోంది. ఈ నూతన సంవత్సరం అదృష్టాన్ని తీసుకువచ్చే గ్రహాల అమరికతో శక్తివంతమైన యోగాలను ఏర్పరుస్తుంది. 2025 సంవత్సరంలో శుక్రుని సంచారం కారణంగా మాలవ్య రాజయోగం, కేంద్ర త్రికోణ గృహాలలోని గ్రహాలు సామరస్య పూర్వకమైన అమరికను సృష్టించినప్పుడు కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది.

మాలవ్య రాజయోగం
ఈ రెండు రాజయోగాలు అత్యంత పవిత్రమైన రాజయోగాలుగా పరిగణించబడతాయి. విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు తన సొంత రాశిలో లేదా ఉన్నతమైన రాశిలో ఒక కేంద్ర గృహాన్ని ఒకటవ, నాలుగవ, ఏడవ లేదా పదవ గృహాన్ని ఆక్రమించినప్పుడు మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. మాలవ్య రాజయోగం పంచ మహాపురుష యోగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

In 2025 these zodiac signs will get wealth due to Malavya and Kendra Trikona Rajyoga

కేంద్ర త్రికోణ రాజయోగంతోనూ సంపదలు
మాలవ్య రాజ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే కేంద్ర త్రికోణ రాజయోగం కారణంగా కూడా అపారమైన విజయాలు, సంపదలు కలుగుతాయి. 2025 సంవత్సరంలో ఈ రెండు రాజయోగాల కారణంగా ప్రయోజనాలను పొందే రాశులను గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

వృషభ రాశి
శుక్రుడు వృషభ రాశిని పాలిస్తున్న కారణంగా వృషభ రాశి మాలవ్య రాజయోగం యొక్క పూర్తి ప్రయోజనాలను పొందుతుంది. వృషభ రాశి వారు ఆర్థిక లాభాలను, వృత్తిపరమైన ప్రగతిని సాధిస్తారు. వర్తక వ్యాపారాలు చేసేవారు కొత్త అవకాశాలతో ముందుకు వెళ్తారు. పెట్టిన పెట్టుబడులు గణనీయమైన రాబడిని ఇస్తాయి.

తులారాశి
శుక్రుడు పాలించే తులా రాశి మాలవ్య రాజయోగం మరియు కేంద్ర త్రికోణ రాజయోగం ప్రభావంతో సానుకూల ఫలితాలను పొందుతుంది. తులా రాశి జాతకులు ఈ సమయంలో వ్యక్తిగత జీవితంలోనూ, వృత్తి జీవితంలోనూ పురోగతిని సాధిస్తారు. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఈ సమయంలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.

మకర రాశి
మాలవ్య రాజయోగం మరియు కేంద్ర త్రికోణ రాజయోగం కారణంగా మకర రాశి జాతకులకు శుభ ఫలితాలు వస్తాయి. ఈ రెండు యోగాల మిశ్రమ ప్రభావం మకర రాశి వారిపై బాగా పడుతుంది. కెరీర్లో పురోగతి, ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు గణనీయమైన లాభాలను పొందుతారు.

మీన రాశి
మాలవ్య రాజయోగం మరియు కేంద్ర త్రికోణ రాజయోగం కారణంగా 2025 సంవత్సరంలో మీనరాశి జాతకులు అదృష్టాన్ని పొందుతారు. ఊహించని మూలాల ద్వారా వీరికి ఆర్థిక లాభాలు కలుగుతాయి. ప్రయాణాలు లాభాలను చేకూరుస్తాయి. సమాజంలో ఉన్నత వర్గాలతో సంబంధాలు వృద్ధి చెందుతాయి. ఈ సమయంలో కుటుంబంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+