ఫిబ్రవరిలో ఈ రాశులవారు నక్క తోక తొక్కుతున్నారు!
వేద జ్యోతిష శాస్త్రంలో ప్రతి నెలలో జరిగే గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. ఫిబ్రవరి నెలలో నాలుగు పెద్ద గ్రహ సంచారాలు జరగబోతున్నాయి. ఫిబ్రవరి నెలలో సూర్యుడు అంగారక గ్రహం మరియు బృహస్పతి ఒకసారి తమ ప్రయాణాన్ని సాగిస్తారు. ఇక బుధుడు రెండుసార్లు సంచారాన్ని సాగిస్తాడు. ఈ గ్రహ కదలికల కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
ఫిబ్రవరిలో ముఖ్య గ్రహాల సంచారం
ఫిబ్రవరి 4వ తేదీ గ్రహాలకు గురువైన బృహస్పతి వృషభ రాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 11వ తేదీన బుధుడు కుంభరాశిలో సంచరిస్తాడు. మరుసటి రోజు సూర్యుడు కుంభ రాశిలో సంచరిస్తాడు, సూర్యుడు, బుధుడు, కుజుడు కుంభరాశిలో ఉండటం వల్ల త్రిగ్రాహి యోగం కూడా ఏర్పడుతుంది. ఆ తర్వాత కుజుడు వృషభ రాశిలో సంచరిస్తాడు. ఈ నెలాఖరులో బుధుడు మీనరాశిలో సంచరిస్తాడు. దీనివల్ల కొన్ని రాశులు అదృష్ట రాశులుగా మారుతున్నాయి.

మేష రాశి
2025 ఫిబ్రవరి నెలలో మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు కలిసి వస్తుంది. విదేశీ ప్రయాణాలు చేసే వారు మంచి ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో పెట్టి పెట్టుబడులు గొప్ప ఫలితాలను ఇస్తాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యంగా జీవిస్తారు. వివిధ పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.
మిధున రాశి
ఫిబ్రవరి మాసం మిధున రాశి వారికి ఫలవంతంగా ఉంటుంది. ఈ మాసంలో వర్తక వ్యాపారాలు చేసేవారు అధిక లాభాలను ఆశించవచ్చు. ఉద్యోగస్తులు కెరీర్ లో ఉన్నత స్థానాలను పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. చట్టపరమైన వ్యవహారాలలో మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఆస్తులు వాహనాలు కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం. ఇది మిధున రాశి వారికి లాభదాయకంగా ఉండే సమయం.
సింహరాశి
ఫిబ్రవరి మాసం సింహ రాశి వారికి సంతోషాన్ని ఇస్తుంది. ఫిబ్రవరి మాసంలో సింహరాశి జాతికులు గొప్ప ఫలితాలను పొందుతారు. పూర్వీకులు ఆస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కారమై ఆస్తి లాభం కలుగుతుంది. ఉద్యోగ జీవితంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
కుంభరాశి
ఫిబ్రవరి మాసంలో కుంభ రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. కుంభ రాశి వారు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలంటే ఈ సమయం అనుకూలమైన సమయం. పోటీ పరీక్షల్లో కుంభరాశి వారు గొప్ప విజయాలను సాధిస్తారు. మతపరమైన ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశం ఉంది. విద్యార్థులు ఈ సమయంలో గొప్ప విజయాలను సాధిస్తారు. అయితే అపార్థాలకు, తగవులకు దూరంగా ఉండాలని సూచించబడింది. కుంభ రాశి వారికి ఈ సమయం ఆర్థిక పురోగతిని సూచిస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications