జనవరి నెలలో శుక్రుడి దయతో వీరికి అదృష్టం తలుపు తడుతుంది!
జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలు దేనికవే ప్రత్యేకమైనవి. నవగ్రహాలు నిర్దిష్ట కాలమానం ప్రకారం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తాయి. ఇక గ్రహాలలో ముఖ్య గ్రహమైన శుక్రుడు సంపదలకు, విలాసాలకు అధిపతి. అటువంటి శుక్రుడు సంక్రాంతి పండుగకు ముందు మకర రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది.
జనవరిలో శుక్ర రాశి మార్పు
జనవరి మాసంలో శుక్రుడు శనిచే పాలించబడే మకర రాశిలోకి సంచరిస్తాడు. జనవరి 13వ తేదీ నుండి శుక్రుడు మకర రాశిలో సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. వారు విశేషమైన ఆర్థిక లాభాలను చూస్తారు. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

తులారాశి
శుక్ర సంచారం తులా రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సంచారం వల్ల తులా రాశి వారు అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. కొత్త వ్యాపార ఒప్పందాలు లాభాలను ఇస్తాయి. ఈ సమయంలో సంపదలు, విలాసాలు పెరుగుతాయి. నూతన వాహనాలను, ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సంతోషాన్ని కలిగిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి శుక్ర సంచారం కారణంగా 2026 లో లాభాలు వస్తాయి. ఈ సంచారం ఈ రాశి వారి సంపద గృహంలో జరగడం వల్ల ఊహించని ఆర్థిక లాభాలను అనుభవిస్తారు. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. రోజువారి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే వారికి కొత్త విజయాలు వస్తాయి. కుటుంబ మద్దతు మరియు కుటుంబ సమతుల్యత ఈ సమయంలో మీకు మనశ్శాంతిని ఇస్తుంది. ధనుస్సురాశి వారికి సంపదలు తెచ్చి పెడుతుంది.
మకర రాశి
2026 జనవరిలో శుక్ర సంచారం మకర రాశి జాతకులకు లబ్ధిని చేకూరుస్తుంది. మకర రాశిలోనే శుక్రుడు ప్రవేశించడం వల్ల ఈ సమయంలో మకర రాశి వారి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మకర రాశిలో మొదటి గృహంలో శుక్ర సంచారం జరగడం వల్ల ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనాలను చేకూరుస్తుంది. వ్యాపారాలలో పురోగతిని కలిగిస్తుంది. భాగస్వామ్య పనుల నుండి ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. వివాహితులు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆకస్మిక ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ విషయాలలోనూ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.
ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications