ఈ రాశి వారు పెట్టుబడులు పెట్టడం మంచిది
కర్కాటక రాశివారికి ఈ సంవత్సరం ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.
ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 22 వరకు గురువు మీ రాశికి తొమ్మిదవ స్థానమైన మీన రాశిలో ఉంటాడు. ఆ తర్వాత 10వ స్థానమైన మేష రాశి లోకి ప్రవేశించి, సంవత్సరమంతా ఇదే స్థానములో సంచరిస్తాడు.

సామాన్యంగా ఉంటుంది..
కర్కాటక రాశివారికి ఈ సంవత్సరం ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. గురు గోచారం ఏప్రిల్ వరకు అనుకూలంగా ఉండటంవల్ల ఆర్థికంగా అభివృద్ధి సాధ్యమవుతుంది. ఖర్చు ఉన్నప్పటికీ ఆదాయం బాగుండటంవల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. స్తిరాస్థులు కొనుగోలు చేయాలనుకుంటే ఏప్రిల్ లో కొనుగోలు చేయడం మంచిది. ఆ తర్వాత పెట్టుబడులు పెట్టడం, కొనుగోళ్లు చేయడం మంచిది కాదు. ఆ సమయంలో గురు గోచారం అనుకూలంగా ఉండదు.

ఒత్తిడి ఎక్కువవుతుంది
శని దృష్టి 2, 10, 6 ఇంటిపై ఉండటంవల్ల ఖర్చులు పెరగడమే కాకుండా ఆర్థిక సంబంధ ఒత్తిడి కూడా రోజురోజుకు ఎక్కవవుతూ ఉంటుంది. బ్యాంకు నుంచి రుణాలు, లేదంటే మిత్రుల నుంచి అప్పుగా నగదు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే గురు దృష్టి ఏప్రిల్ రెండు, ఆరో ఇంటిపై ఉండటంవల్ల ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. కానీ వాటినుంచి బయటపడే మార్గాలు కూడా లభిస్తాయి. దీనివల్ల కొంత ఒత్తిడి తగ్గుతుంది. ముందు, వెనక ఆలోచించకుండా నగదు ఖర్చుచేయడం తగ్గించుకోవాలి. వేరేవారి మాట విని గొప్పలకు పోయి విలాసాల కోసం డబ్బు ఖర్చుచేసే అవకాశం ఉంది. కాబట్టి ఖర్చుల విషయంలో తొందరపడొద్దు.

పెద్దల సలహాతోనే పెట్టుబడులు పెట్టాలి..
శ్రేయోభిలాషులు, పెద్దల సలహాలను తీసుకొని పెట్టుబడులు పెట్టడం మంచిది. స్తిరాస్థి కొనుగోలు వ్యవహారాల్లో మీరు మోసపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే పెద్దల సలహాలు తీసుకొని పెట్టుబడి పెట్టాలి. తక్కువ ధరకు వస్తోందని భూమికానీ, ఇల్లు కానీ కొనుగోలు చేయకండి. దీనివల్ల చేతిలో డబ్బు ఖర్చవడమే కాకుండా కొనుగోలు చేసిన భూమి కూడా ఉపయోగంలోకి రాకుండా ఉంటుంది. ఎంతగా పొదుపు చేయగలిగితే భవిష్యత్తులో ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. కేతువు గోచారం నవంబరు నుంచి మూడో ఇంట్లో ఉంటుంది. రాహు గోచారం తొమ్మిదో ఇంట్లో ఉండటంవల్ల ఆర్థికంగా కలిగే ఒత్తిళ్లు తగ్గడంతోపాటు స్తిరాస్థి వ్యవహారాల్లో సమస్యలన్నీ తొలగిపోయి చేతికి కొంత నగదు అందే అవకాశం ఉంటుంది.












Click it and Unblock the Notifications