జులై నెలలో అదృష్టం మొత్తం ఈ రాశులదే
జులై నెల జ్యోతిష్యం ప్రకారం కీలకమైన నెల. ఈ నెలలో రెండు ప్రధాన గ్రహాలు తిరోగమనంలో సంచరించనున్నాయి. కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించే న్యాయదేవుడు శని, గ్రహాల రాకుమారుడు బుధుడు తిరోగమనం చెందడంవల్ల నాలుగు రాశులవారికి అదృష్టం దరిద్రంలా పట్టుకుంటోంది. జులై 17 నుంచి ఆగస్టు 11 వరకు బుధుడు, జులై 13 నుంచి నవంబరు 28 వరకు శని మీనరాశిలో తిరోగమనంలో ఉంటాయి. దీనివల్ల ఏయే రాశులకు ఏవిధంగా కలిసిరానుందనే విషయాన్ని తెలుసుకుందాం.
మకర రాశి
వీరికి కూడా అదృష్టం బాగా కలిసివస్తోంది. ఆస్తులు కొనుగోలు వల్ల అనేక ప్రయోజనాలు దక్కనున్నాయి. దానివల్లే అదృష్టం పట్టుకుంటుంది. మంచి డీల్ కుదుర్చుకుంటారు. ఒకరకంగా మకరరాశివారికి ఈ సమయం అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. జాగ్రత్తగా చేసుకుంటే అన్ని పనుల నుంచి ఆర్థిక లాభాలున్నాయి. దుబారా ఖర్చును నియంత్రించుకోవాలి.

మీన రాశి
జీవితంలో ఈ రాశివారు మంచిస్థాయికి చేరాలంటే ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. అన్ని విషయాల్లో నియంత్రణ అవసరంతోపాటు అన్ని పనుల్లో సమతుల్యత పాటించాల్సి ఉంటుంది. సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులేమీ ఉండవు.
వృషభ రాశి
అదృష్టం మొత్తం ఈ రాశివారివైపే తిరుగుతుంటుంది. ఏ పని తలపెట్టినా విజయం తథ్యం. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. ఇబ్బందులేవీ ఉండవు. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. కొత్త వ్యాపారం గురించి ఆలోచిస్తుంటారు. పూర్తిస్థాయిలో విజయం సాధించేందుకు శక్తియుక్తులన్నింటినీ ఉపయోగించి పేరు తెచ్చుకుంటారు.
ధనుస్సు రాశి
ఉద్యోగస్థులకు వేతనం పెరిగి పదోన్నతులు లభిస్తాయి. కార్యాలయంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. జీవితాన్ని సంతోషంగా గడుపుతారు. ఆనందం వెల్లివిరుస్తుంది. అదృష్టం తోడుండటంవల్ల అన్ని పనులు పూర్తవుతాయి. పెండింగ్ పనులు పూర్తిచేయడానికి ఇది మంచి సమయం. కుటుంబంలో పెద్దల అనారోగ్యం తగ్గిపోతుంది.












Click it and Unblock the Notifications