Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫిబ్రవరిలో వారికి సంపదల సునామీ అనుగ్రహించిన గురు, కుజులు!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ సంచారాలకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో గ్రహాల వక్రగతికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఫిబ్రవరి 26వ తేదీన కుజుడు వక్రంగా మిధున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. చాలా అరుదుగా ఇలా వక్రగతిలో కుజ సంచారం జరుగుతూ ఉంటుంది. అంతేకాదు ఫిబ్రవరి 5వ తేదీన గురు గ్రహం వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇక ఈ రెండు ముఖ్య గ్రహాల కారణంగా కొన్ని రాశులవారు శుభ ఫలితాలను పొందుతారు.

మేషరాశి
మేష రాశి వారికి కుజుడి వక్రగతి కారణంగా ఆకస్మిక ధన లాభాలు వస్తాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉన్నత పదవులు లభించే అవకాశాలు ఉన్నాయి. మేష రాశి వారి ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడంతో మేషరాశి వారు ఈ సమయంలో ప్రశాంతంగా జీవిస్తారు.

jupiter and mars blessed these zodiac signs with a tsunami of wealth in feberuary

వృషభ రాశి
ముఖ్యంగా రెండు గ్రహాలు ప్రత్యేకమైన ప్రభావం కారణంగా వృషభ రాశి వారికి అద్భుతమైన ధనయోగం ఏర్పడుతుంది. వృషభ రాశి వారు ఈ సమయంలో ఎలాంటి ఆదాయ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అవుతారు. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితులు కూడా గతం కంటే మెరుగవుతాయి వీరి వైవాహిక జీవితం సుఖదాయకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో గణనీయమైన పురోగతిని సాధిస్తారు.

సింహరాశి
సింహ రాశి వారికి కుజుడి వక్రగతి తో పాటు గురు సంచారం కారణంగా లబ్ధి చేకూరుతుంది. వీరికి ఊహించిన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగాలు చేస్తున్న వారికి పదోన్నతులు లభిస్తాయి. వివాహం కాని వారికి పెళ్లిళ్లు అయ్యే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో లబ్ధి పొందుతారు.

మకర రాశి
మకర రాశి వారికి రెండు గ్రహాల ప్రత్యేకమైన ప్రభావం కారణంగా శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగాలు చేసే వారికి, వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఇది మకర రాశి వారికి శుభ సమయం.

కన్యారాశి
కుజుడు వక్రగతి తో పాటు, గురు సంచారం కారణంగా కన్యా రాశి వారికి సమయం చాలా బాగుంటుంది. కన్య రాశి జాతకులు సంపన్నులు అవుతారు. ఉద్యోగాలు చేస్తున్న వారికి భారీగా జీతాలు వచ్చే అవకాశం ఉంది. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+