బృహస్పతి-కుజ సంయోగం.. జులై 12 నుండి ఈరాశులవారికి ధననష్టం
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల కలయిక అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం దేవగురువు బృహస్పతి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. జులై 12వ తేదీన కుజుడు కూడా వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో కుజుడు గురుడు కలయిక జరుగుతుంది.
కుజ గురు గ్రహాల కలయికతో నష్టపోయే రాశులు
కుజ గురు గ్రహాల కలయిక ఆగస్టు 26వ తేదీ వరకు ఉంటుంది. అయితే కుజుడు వృషభ రాశిలో 45 రోజులు పాటు ఉంటాడు. ఈ కుజ గురు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తే, మరికొన్ని రాశుల వారిని దురదృష్టం వెంటాడుతుంది. ఇక ఏ రాశుల వారికి కష్ట కాలం వస్తుందో ప్రస్తుతం తెలుసుకుందాం.

వృషభ రాశి
కుజ మరియు గురు గ్రహాల కలయిక కారణంగా వృషభ రాశి జాతకులకు కష్టాలు వస్తాయి. ఈ సమయంలో వృషభ రాశి జాతకులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపార సంబంధితమైన పనులలో అడ్డంకులు ఏర్పడతాయి. ఈ సమయంలో ఎవరితో ఆర్థిక లావాదేవీలు చేయకుండా ఉంటే మంచిది. పొరపాటున కూడా అప్పులు ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే తిరిగి వచ్చే అవకాశం లేదు.
మిధున రాశి
కుజ మరియు గురుగ్రహాల కారణంగా మిధున రాశి జాతకులకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమయంలో మిధున రాశి జాతకుల ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. వీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫలితంగా మిధున రాశి జాతకుల మానసిక ఒత్తిడి బాగా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. అసలు ప్రశాంతంగా ఉండలేరు.
తులారాశి
కుజ మరియు గురు గ్రహాలు కలయిక వల్ల తులా రాశి వారు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సమయంలో డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అనాలోచితంగా డబ్బుల విషయంలో లావాదేవీలు జరిపితే తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. తులా రాశి జాతకులు ఈ సమయంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి.
కుంభరాశి
కుజ గురు గ్రహాలు కలయిక వల్ల కుంభ రాశి జాతకులు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోని ఆర్థిక ఇబ్బందులతో ఈ సమయంలో కష్టాలను చూడాల్సి వస్తుంది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం చేసేవారు తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications