బృహస్పతి కటాక్షంతో 2025 వరకు ఈ రాశులకు తిరుగుండదు
నవగ్రహాలు దేనికవే ప్రత్యేకమైనవి. నవగ్రహాలలో దైవ గురువుగా భావించే బృహస్పతికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. బృహస్పతి 12 13 నెలలకు ఒకసారి రాశిని మార్చుకుంటుంది. ఇతర గ్రహాల మాదిరిగానే బృహస్పతి కూడా తన రాశిని, నక్షత్రాన్ని మార్చుకుంటుంది. ఈ సంవత్సరం మే 1వ తేదీ నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించి ప్రయాణం సాగిస్తున్న బృహస్పతి 2025 మే నెల వరకు వృషభ రాశిలోనే సంచరిస్తుంది.
వృషభ రాశిలో బృహస్పతి సంచారం
వృషభ రాశిలో బృహస్పతి సంచారం అనేక రాశుల వారికి లబ్ధిని చేకూరుస్తుంది. శుక్రుడు అధిపతిగా ఉండే వృషభ రాశిలో బృహస్పతి సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అఖండ ధనలాభం కలుగుతుంది. వారి జీవితంలో సంతోషం, ఆనందం, శ్రేయస్సు కలుగుతాయి. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేష రాశి
మేష రాశి వారికి బృహస్పతి సంచారం చాలా ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. బృహస్పతి సంచారం కారణంగా 2025 వరకు మేష రాశి వారు సిరిసంపదలను పొందుతారు. ఆదాయంలో గణనీయమైన వృద్ధి ఉంటుంది. గతంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ ఇప్పుడు పూర్తవుతాయి. ఈ సమయంలో మీరు శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది.
వృషభ రాశి
బృహస్పతి సంచారం కారణంగా 2025 వరకు వీరి అదృష్టం ప్రకాశిస్తుంది. వృషభ రాశి జాతకుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులను సృష్టించుకుంటారు. బృహస్పతి ఆశీర్వాదంతో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోయి, జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆధ్యాత్మికంగా కూడా ఈ సమయంలో బలంగా ఉంటారు.
కర్కాటక రాశి
బృహస్పతి కారణంగా కర్కాటక రాశి జాతకులకు లబ్ధి జరుగుతుంది. ఈ సమయంలో కర్కాటక రాశి జాతకులు అనుకున్న లక్ష్యాలను నెరవేర్చగలుగుతారు. కర్కాటక రాశి జాతకుల సమస్యలన్నీ తొలగిపోతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది. ఈ సమయంలో మంచి జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. కెరీర్ లోను గణనీయమైన ఎదుగుదల ఉంటుంది.
సింహరాశి
బృహస్పతి సంచారం కారణంగా సింహ రాశి వారి జాతకం ఈ సమయంలో బాగుంటుంది. 2025 వరకు బృహస్పతి సంచారం కారణంగా సింహ రాశి వారికి గణనీయమైన లాభాలు వస్తాయి. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనికి తగిన ఫలితం ఉంటుంది. సింహరాశి జాతకులు చేసిన కృషిని ఉన్నతాధికారులు గుర్తిస్తారు. ఏదైనా వ్యాపారం చేయాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్న ఇదే సరైన సమయం. దాంపత్య జీవితం జీవిత భాగస్వామితో సంతోషంగా సాగుతుంది. పూర్వీకుల నుండి ఆస్తులు వచ్చే అవకాశం ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
జన్మ నక్షత్రం పుబ్బ, ఉత్తర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: ఆర్థికంగా లాభాలున్నాయి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి -
వాస్తు ప్రకారం ఇంట్లో క్యాలెండర్ ఎక్కడ ఉండాలి? -
ముఖ్యమైన వాస్తు చిట్కా: బీరువాలో డబ్బుకు ఎదురుగా అద్దం పెట్టండి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..!












Click it and Unblock the Notifications