ఆరుద్ర నక్షత్రంలోకి బృహస్పతి.. వీరు పట్టిందల్లా బంగారం!
గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ఉంటాయి. గ్రహాలు ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రం లోకి సంచారం చేస్తూ ఉంటాయి. ప్రస్తుతం మిధునరాశిలో సంచారం చేస్తున్న బృహస్పతి త్వరలో ఆరుద్ర నక్షత్రంలోకి సంచారం చేయబోతున్నాడు. ఆరుద్ర నక్షత్రంలో బృహస్పతి సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది.బృహస్పతి నక్షత్ర సంచారంతో కొన్ని రాశులవారికి అన్ని విధాలా కలిసి వస్తుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకోండి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి బృహస్పతి నక్షత్ర సంచారం కారణంగా సానుకూల ఫలితాలు ఉంటాయి. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసొస్తుంది. అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే మంచిది.

మిథునరాశి
మిధున రాశి వారికి బృహస్పతి నక్షత్ర సంచారం కలిసి వస్తుంది. బృహస్పతి నక్షత్ర సంచారంతో వీరి ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. ఉద్యోగాలు చేసే మిధున రాశి జాతకులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. వర్తక, వ్యాపారాలు చేసే వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. మిధున రాశి వారు ఈ సమయంలో ఇతరులచే ఆకర్షితులవుతారు.
సింహరాశి
సింహ రాశి వారికి బృహస్పతి నక్షత్ర సంచారం కలిసి వస్తుంది. ఈ సమయంలో సింహరాశి జాతకులు పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ లు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఏ పని అనుకున్న సాధిస్తారు. వ్యాపారం చేసేవారికి లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు సక్సెస్ అందుతుంది. స్నేహితులు, తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు అందుతాయి. ఈ సమయంలో ఏది అనుకున్న కచ్చితంగా విజయం సాధిస్తారు.
తులా రాశి
తులా రాశి వారికి బృహస్పతి నక్షత్ర సంచారం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో తులా రాశి జాతకులు కెరీర్లో విజయాలను పొందుతారు. అయితే కోపంలో తీసుకునే నిర్ణయాల కారణంగా వీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి తులా రాశి జాతకులు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి.
కుంభరాశి
బృహస్పతి నక్షత్ర సంచారం కారణంగా కుంభ రాశి వారికి లాభాలు వస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. సృజనాత్మక రంగాలలో పనిచేసే వారికి కలిసి వస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించిన వారికి కలిసి వస్తుంది. వీరి ప్రేమ జీవితం చాలా బాగుంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications