2025లో ఈ రాశులకు అఖండ సంపదలనిస్తున్న బృహస్పతి
జ్యోతిష్యం ప్రకారం దేవతల గురువైన బృహస్పతి అనుగ్రహం ఉంటే ఆ రాశులవారి జీవితం అద్భుతంగా ఉంటుంది. సంపదను ప్రసాదిస్తూనే ఆధ్యాత్మికతవైపు నడిపిస్తాడు. జీవితానికి సార్థకత చేకూరుస్తాడు. అందుకే జాతకంలో గురుడు శుభస్థానంలో ఉంటే వారి జీవితం బ్రహ్మాండంగా సాగుతుందని చెప్పొచ్చు. శుక్రుడి తర్వాత అత్యంత శుభాలను కలిగించేది గురుడే. పిల్లలను, సంపదను, శ్రేయస్సుతోపాటు అదృష్టాన్ని, జ్ఞానాన్ని ఇస్తాడు. బృహస్పతి సంచారం చేస్తే కొన్ని రాశులకు ఆర్థికంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
సింహ రాశి
వీరు ఏ రంగంలో అడుగు పెట్టినా విజయాన్ని అందుకుంటారు. అది చాలా సహజంగా జరుగుతుంటుంది. అందుకే ఈ రాశివారిని అదృష్టవంతులు అంటారు. అయితే శ్రమ కూడా పడాలి. దీర్ఘకాలికంగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. స్నేహితుల నుంచి, బంధువుల నుంచి, తోబుట్టువుల నుంచి సహకారం అందుతుంది. ఊహించనిరీతిలో విజయాన్ని పొందుతారు.

కర్కాటక రాశి
ఈ రాశివారి సంపద భారీగా పెరుగుతుంది. విద్యార్థులకు ఈ సమయం చాలా బాగుంటుంది. ఆస్తులు కలిసిరావడానికి అవకాశం ఉంది. వృత్తి జీవితంలో మంచి పురోగతి సాధిస్తారు. బృహస్పతి అనుగ్రహం వీరికి ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ రాశిలో జన్మించినవారందరికీ సంపదకు అవకాశం ఉంది. అవకాశాలను అందిపుచ్చుకుంటే జీవితంలో రాణిస్తారు.
ధనుస్సు రాశి
ఈ రాశివారి ఆత్మవిశ్వాసం బాగా పెరిగి అన్ని పనులు సమర్థవంతంగా పూర్తిచేస్తాడు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతారు. వీరిని కాపాడేది వీరి కష్టమే. ఆర్థిక ప్రయోజనాలు వీరికి చాలా మెండుగా ఉన్నాయి. ఆధ్యాత్మిక వాతావరణంవైపు మొగ్గుచూపిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. కుంభమేళాకు వెళ్లే ప్రయత్నం చేస్తారు.
మీన రాశి
బృహస్పతికి ఈ రాశి అంటే చాలా ఇష్టం. వీరికి ఓర్పు చాలా ఉంటుంది. దీనివల్ల వీరు జీవితంలో విజయం సాధిస్తారు. అలాగే సంగీతంపై కూడా మక్కువ ఎక్కువ. జీవితం ఆనందంగా, సంతోషంగా గడిపేందుకు గురుడు అదృష్టాన్ని ప్రసాదిస్తుంటాడు. ఎదుటివారికి డబ్బులిచ్చే సమయంలో వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ పని తలపెట్టినా నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి బృహస్పతిని పూజిస్తే మంచి జరుగుతుంది.












Click it and Unblock the Notifications