విజయదశమితో పాటు దీపావళి పండుగకు వీరికి బృహస్పతి బహుమానం!

వేద జ్యోతిష్య శాస్త్రంలో దేవ గురువు బృహస్పతికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ప్రస్తుతం గురు భగవానుడు మృగశిర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. నవంబర్ 28వ తేదీ వరకు బృహస్పతి మృగశిర నక్షత్రంలోనే సంచరిస్తాడు. మృగశిర నక్షత్రంలో బృహస్పతి సంచారం కారణంగా విజయదశమితో పాటు దీపావళి పండుగకు కూడా కొన్ని రాశుల వారికి విశేష ధన లాభం కలుగుతుంది. ఊహించని ఆర్థిక ప్రయోజనాలతో పాటు వాహన యోగాలను అనుభవిస్తారు.

నవంబర్ 28 వరకు మృగశిర నక్షత్రంలోనే బృహస్పతి
నవగ్రహాలలో అత్యంత ముఖ్యమైన గ్రహంగా భావించే బృహస్పతి సంపదలకు, సౌభాగ్యానికి, సంతానానికి, వివాహ వరానికి కారకుడిగా చెబుతారు. బృహస్పతి ఒక రాశి నుంచి మరొక రాశి లోకి మారడానికి సంవత్సర కాలం పడుతుంది. అయితే బృహస్పతి నక్షత్రం మార్పు మాత్రం మూడు నెలలకు ఒకసారి జరుగుతుంది. ఆగస్టు 20న బృహస్పతి మృగశిర నక్షత్రంలో ప్రవేశించి నవంబర్ 28 వరకు మృగశిర నక్షత్రంలోనే ఉంటాడు. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం

Jupiter gift to these zodiac signs for Diwali along with Vijayadashami

మేషరాశి
బృహస్పతి నక్షత్ర సంచారం మేష రాశి వారికి విజయాలను అందిస్తుంది. మేష రాశి వారి అదృష్టం మెరుస్తుంది. మేషరాశి జాతకులు అన్ని రంగాలలోనూ విజయాన్ని సాధిస్తారు. నూతన ఆదాయ వనరులు పెరుగుతాయి. పనిచేసే చోట మేషరాశి జాతకులు ప్రశంసలు పొందుతారు. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా విజయలక్ష్మి వరిస్తుంది.

కర్కాటక రాశి
బృహస్పతి నక్షత్ర సంచారం కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. కర్కాటక రాశి జాతకులు ఈ సమయంలో కొత్త ఇంటిని, కొత్త వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి నుంచి కర్కాటక రాశి జాతకులకు పూర్తి మద్దతు లభిస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి మంచి లాభాలు వస్తాయి. ఇది కర్కాటక రాశి వారికి అదృష్ట సమయం. దసరా దీపావళి తో పాటు నవంబర్ 28 వరకు వీరికి తిరుగేలేదు.

వృశ్చిక రాశి
బృహస్పతి సంచారం వృశ్చిక రాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది. వృశ్చిక రాశి వారికి నేడు సంతోషం కలుగుతుంది. మీరు ఈ సమయంలో ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. పనిచేసే చోటపై అధికారుల మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో చేపట్టిన పనులన్నీ విజయవంతం అవుతాయి. వృశ్చిక రాశి వారికి ఇది అదృష్ట సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+