జాతకంలో హంసయోగం ఉన్న వారికి సంపదల వర్షం ఆదేశించిన బృహస్పతి!
వేద జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు తమదైన స్థానం ఉంటుంది. గ్రహాలలో దేవగురువు అయిన బృహస్పతికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. దేవగురువు బృహస్పతి వల్ల కొన్ని రాశుల వారికి శుభ యోగాలు కలుగుతాయి. దేవగరువు బృహస్పతి వల్ల ఏర్పడే అత్యంత అదృష్టవంతమైన యోగంగా హంస యోగాన్ని చెబుతారు.
హంస యోగం .. బృహస్పతి కటాక్షం
పంచ మహాపురుష యోగాలలో ఒకటిగా హంస యోగాన్ని పరిగణిస్తారు. ఎవరికైనా జన్మ చార్ట్ లో హంసయోగం ఉంటే వారి అదృష్టం ఇంత అంతా అని చెప్పడానికి వీలు లేదు. ఈ యోగం జీవితం మీద చాలా ప్రయోజనకరమైన ప్రభావాలను చూపిస్తుంది. హంసయోగం ధనస్సు, కర్కాటక, మీనరాశులలో లగ్నం నుండి కేంద్ర గృహాలలో ఒకటి, నాలుగు, ఏడు, పదవ గృహాలలో దేవగురువు బృహస్పతి ఉండటం వలన ఏర్పడుతుంది.

హంస యోగం జాతకంలో ఉంటే జీవితం ఇలా
హంసయోగం ఉన్న వ్యక్తి జీవితంలో జ్ఞానవంతుడుగా తయారవుతాడు. ఏ పని చేసినా అతనికి విజయం లభిస్తుంది. బృహస్పతి దయవల్ల అతనికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి . జీవితంలో ఎటువంటి కష్టమైన సవాళ్లనైనా చాలా సునాయాసంగా పరిష్కరించగలుగుతారు. వీరు ఆధ్యాత్మికంగాను సన్మార్గంలో నడుస్తారు. దేవగురువు బృహస్పతి అనుగ్రహం వల్ల వీరిలో జ్ఞానంతో పాటు ఆత్మవిశ్వాసం, ధైర్యం కూడా పెంపొందుతుంది.
ఆర్ధికంగా వీరికి డబ్బే డబ్బు
జాతకంలో హంసయోగం ఉన్నవారు ఆర్థిక కష్టాలను ఎదుర్కోరు. వీరికి డబ్బుకు లోటు ఉండదు. దాతృత్వ కార్యక్రమాలు చేస్తూ అందరి ఆశీర్వాదాలు పొందుతారు. హంసయోగం ఉన్న వ్యక్తులు చాలా తెలివిగను, నిపుణత కలిగిన వారు గాను ఉంటారు. ఇక జాతకంలో హంసయోగం ఉంటే కేంద్ర గృహంలోని ఒకటవ ఇంట్లో బృహస్పతి ఉంటే అటువంటి జాతకులకు గొప్ప వ్యక్తిత్వం ఉంటుంది. మంచి ఆరోగ్యం, నాయకత్వ లక్షణాలు ఉంటాయి.
హంస యోగంతో సంపదల వర్షం
అదే కేంద్ర గృహంలోని నాలుగవ ఇంట్లో బృహస్పతి ఉంటే తల్లిదండ్రుల నుండి, పూర్వీకుల నుండి ఆస్తులు వచ్చి పడతాయి. మీరు సంతోషంగానూ జీవిస్తారు. ఇక ఏడవ ఇంట్లో బృహస్పతి ఉంటే జీవిత భాగస్వామి వారి జీవితాలను సుసంపన్నం చేస్తారు. వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. కేంద్ర గృహంలోని పదవ ఇంట్లో బృహస్పతి ఉంటే బోధన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు తత్వశాస్త్రంలోనూ పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. హంసయోగం జాతకంలో ఉంటే ఆ వ్యక్తికి సంపదల వర్షం కురుస్తుంది . ఎప్పుడూ అదృష్టవంతుడిగా, సమాజంలో చరిష్మా ఉన్న వ్యక్తిగా నిలుస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications